Kavya Maran : ఐపీఎల్ వేలంలో మార్పులు చేయాలన్న సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మార‌న్‌..!

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ఇప్ప‌టి నుంచే అన్ని జ‌ట్లు సిద్ధ‌మ‌వుతోంది.

Kavya Maran

Kavya Maran : ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ఇప్ప‌టి నుంచే అన్ని జ‌ట్లు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ ఏడాది ఆఖ‌రిలో మెగా వేలాన్ని నిర్వ‌హించేందుకు బీసీసీఐ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం బీసీసీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో అన్ని ఫ్రాంచైజీల ఓన‌ర్ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆట‌గాళ్ల రిటెన్ష‌న్‌, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ వంటి ఎన్నో విష‌యాల‌ను ఇందులో చ‌ర్చించారు. అన్ని ఫ్రాంచైజీలు కూడా ఆట‌గాళ్ల రిటైన్ష‌న్‌ సంఖ్య‌ను పెంచాల‌ని కోరుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఇందుకు మ‌ద్ద‌తు ప‌లికారు.

జ‌ట్టును కాపాడుకోవ‌డానికి క‌నీసం 6 గురు ఆట‌గాళ్ల‌ను అట్టిపెట్టుకునే (రిటెన్ష‌న్‌) అవ‌కాశం ఇవ్వాల‌ని, లేదా ఆరు ఆర్‌టీఎం (రైట్‌ టు మ్యాచ్‌) ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డింది. నలుగురు ఆట‌గాళ్లు రిటెన్ష‌న్ ద్వారా మ‌రో ఇద్ద‌రిని ఆర్‌టీఎం ద్వారా తీసుకోవ‌డానికి అవ‌కాశం ఇచ్చినా ఓకే అని చెప్పింది. రిటెన్ష‌న్ చేసుకోవాలా లేదా వేలానికి వ‌దిలి వేసి ఆర్‌టీఎం ద్వారా ఆట‌గాడిని తీసుకోవాల‌నేది ప్లేయ‌ర్‌తో ఫ్రాంచైజీ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునే విధంగా ఉండాల‌న్నారు.

Also Read : పునరాగమనం పై స్పందించిన ష‌మీ.. బీసీసీఐ కండిష‌న్‌కు ఓకే..!

రిటైన్ష‌న్‌లో త‌క్కువ మొత్తం ల‌భించిన సంద‌ర్భాల్లో ఆట‌గాడు వేలానికి వెళ్లేందుకు సిద్ద‌ప‌డిన సంద‌ర్భాలు గ‌తంలో చాలా ఉన్నాయి. ఇక ప్ర‌తి ఆట‌గాడు కూడా తాను మొద‌టి రిటెన్ష‌న్‌గా ఉండాల‌ని కోరుకున్న సంద‌ర్భాలు ఉన్నాయంది. తాను మొద‌టి రిటైన్ష‌న్‌గా ఉండ‌క‌పోతే త‌న‌ను వేలానికి విడిచిపెట్టాల‌ని కొంద‌రు ఆట‌గాళ్లు గ‌తంలో కోరార‌న్నారు. ఇలాంటివి రాకుండా ఉండేందుకు మార్కెట్‌లో ప్లేయ‌ర్ డిమాండ్ బట్టి రిటైన్ష‌న్ లేదా ఆర్‌టీఎం ద్వారా ధ‌ర‌ను నిర్ణ‌యిస్తే బాగుంద‌ని తెలిపింది.

ఒక‌వేళ కేవ‌లం రిటైన్ష‌న్ మాత్ర‌మే ఉంటే.. అప్ప‌డు రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల‌కు సైడ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రిటైన్ కంటే ఎక్కువ మొత్తాన్ని ఫ్రాంచైజీలు చెల్లించే అవ‌కాశం ఉంటుంది. కానీ ఆర్‌టీఎం ద్వారా అయితే.. వేలంలో ఆట‌గాడు మార్కెట్ ధ‌ర‌ను పొందుతాడు. ఫ్రాంచైజీలు వారి ప‌ర్సు వాల్యూని బ‌ట్టి కొనుగోలు చేస్తాయి. దీంతో ప్రాంఛైజీల బ్యాంక్ బ్యాలెన్స్ ప‌రిమితంగా ఉంటుంది. ఇది పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంపొందిస్తుందని, ఐపీఎల్ బ్రాండ్ విలువ‌ను కాపాడుతుందని కావ్య మార‌న్ స‌మావేశంలో చెప్పిన‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Also ead : కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు.. సిక్స‌ర్ల కింగ్..

ట్రెండింగ్ వార్తలు