కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్‌లో చేసిన స్టంట్‌లకు బొక్క బోర్లా పడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లోనే పేరున్న ఫీల్డర్ అయిన పొలార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కిందపడ్డాడు. క్రికెట్ ఫీల్డింగ్‌లో ఫుట్‌బాల్ స్కిల్స్ చూపించబోయి బౌండరీ లైన్ అవతలకు దూకేశాడు. ఏప్రిల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటి చేత్తే క్యాచ్ అందుకున్న పొలార్డ్‌కు ఇలా జరగడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 2గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. 3.4ఓవర్లో బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు. సాహా బౌండరీ వైపుగా షాట్ బాదాడు. దాన్ని ఆపే క్రమంలో పాండ్యా.. పొలార్డ్ ఇద్దరూ పరిగెత్తారు. ముందుగా సమీపించిన పొలార్డ్ బౌండరీ లైన్ దగ్గర్లో కాలితోనే బంతిని తన్నాడు. వేగం ఆపుకోలేక బౌండరీ లైన్‌కు అవతల ఉన్న వైపుకు బోర్డుల మీద నుంచి దొర్లిపడ్డాడు. ఈ వీడియోను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో బీభత్సంగా వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో ముంబై సూపర్ ఓవర్లో విజయం అందుకుంది. ముంబై ఇండియన్స్ తర్వాతి మ్యాచ్‌ను కోల్‌కతాపై వాంఖడే వేదికగా ఆడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో ఆడనుంది.
Humpty Polly had a great fall https://t.co/L7Yrk1qJX1 via @ipl
— Cricket Junkie (@JunkieCricket) May 3, 2019