KKR squad for IPL 2026 these 3 players who can replace Mustafizur Rahman
KKR : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో నిషేదం విధించాలనే డిమాండ్ల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ను విడుదల చేయాలని కేకేఆర్ యాజమాన్ని బీసీసీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ (KKR) జట్టు ముస్తాఫిజుర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ జట్టు 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడిని వదిలివేయడంతో ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ ఎవరిని తీసుకుంటారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అతడి స్థానంలో ఓ ముగ్గురు ఆటగాళ్ల రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
AUS vs ENG : ఇంగ్లాండ్ జోరును అడ్డుకున్న వరుణుడు.. ముగిసిన తొలి రోజు ఆట
రిచర్డ్ గ్లీసన్..
ప్రస్తుతం జరుగుతున్న SA20 ఎడిషన్‌లో రిచర్డ్ గ్లీసన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు, ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అతను డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్. ఇటీవల జోబర్గ్ సూపర్ కింగ్స్ తరపున ఒక మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు అతడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున మూడు మ్యాచ్‌లు ఆడాడు. గ్లీసన్ బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుగా ఉంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన వారిలో ఉన్నాడు కానీ వేలంలో అతని పేరు ఎప్పుడూ రాలేదు.
ఫజల్హాక్ ఫారూఖీ..
అఫ్గానిస్తాన్ పేసర్ ఫజల్హాక్ ఫారూఖీ ఎడమ చేతి వాటం పేసర్. అతడు టీ20 ప్రపంచకప్ 2026 కోసం అఫ్గానిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. 12 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా 51 టీ20Iలలో 63 వికెట్లు తీశాడు. అతను వేలంలో అమ్ముడుపోలేదు.
Sara Tendulkar : సారా టెండూల్కర్ ఇయర్ బుక్ 2025.. జనవరి నుంచి డిసెంబర్ వరకు.. ఫోటోలు వైరల్
స్పెన్సర్ జాన్సన్..
స్పెన్సర్ జాన్సన్ గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు బిగ్‌బాష్‌కు దూరం అయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు కేకేఆర్ తరుపున ఆడాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. అయినప్పటికి కూడా టీ20ల్లో అతడి రికార్డు మెరుగ్గానే ఉంది. 71 మ్యాచ్‌ల్లో 85 తీశాడు. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే కేకేఆర్ మరో ఛాన్స్ ఇవ్వొచ్చు.