AUS vs ENG : ఇంగ్లాండ్ జోరును అడ్డుకున్న వరుణుడు.. ముగిసిన తొలి రోజు ఆట
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో (AUS vs ENG) తొలి రోజు ఆట ముగిసింది.
AUS vs ENG, AUS vs ENG 5th Test, Joe Root, Harry Brook, Rain (PIC credit @englandcricket)
- సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు
- వర్షం, వెలుతురు లేమీతో నిలిచిపోయిన ఆట
- తొలి రోజు ఇంగ్లాండ్‌దే
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా తొలి రోజు ఆటను చాలా త్వరగా ముగించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. జోరూట్ (72; 103 బంతుల్లో 8 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (78; 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఉదయం పూట పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభించడంతో మిచెల్ స్టార్, మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్‌లు చెలరేగారు. తలా ఓ వికెట్ తీశారు. దీంతో ఇంగ్లాండ్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జాక్ క్రాలీ (16), జాకబ్ బెథెల్ (10), బెన్ డకెట్ (27) లు విఫలం అయ్యారు.
Sara Tendulkar : సారా టెండూల్కర్ ఇయర్ బుక్ 2025.. జనవరి నుంచి డిసెంబర్ వరకు.. ఫోటోలు వైరల్
Joe Root and Harry Brook put on England’s best partnership of the #Ashes so far before weather interrupted the day’s play.
Report from the SCG: https://t.co/zra583j7Ko pic.twitter.com/eSCLzPYmoC
— cricket.com.au (@cricketcomau) January 4, 2026
ఈ దశలో ఇన్నింగ్స్ ను నడిపించే బాధ్యతను సీనియర్ ఆటగాడు జో రూట్ భుజాన వేసుకున్నాడు. అతడి హ్యారీ బ్రూక్ తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. తొలుత ఈ జోడీ ఆచి తూచి ఆడింది. క్రీజులోకి కుదురుకున్నాక బ్యాట్లను ఝళిపించింది. వీరిద్దరు వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. అయితే.. వీరి దూకుడికి వరుణుడు బ్రేక్ వేశాడు.
వర్షం రావడంతో టీ విరామాన్ని కాస్త ముందుగానే తీసుకున్నారు. ఆ తరువాత చాలా సేపటికి వర్షం తగ్గినప్పటికి వెలుతురు లేకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. జోరూట్, హ్యారీ బ్రూక్‌లు నాలుగో వికెట్ కు అభేద్యంగా 154 పరుగులు జోడించారు.
