David Warner : బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సెంచరీ.. ఎలైట్ జాబితాలో విరాట్ కోహ్లీ రికార్డు సమం..
బిగ్‌బిష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సిడ్నీ థండర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ శతకంతో (David Warner) చెలరేగాడు.
Big Bash League Warner equals Kohli in elite list with masterclass century
- బిగ్‌బిష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ విధ్వంసం
- సిడ్నీ థండర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ హోబర్ట్ పై విధ్వంసకర శతకం
- టీ20ల్లో వార్నర్‌కు ఇది 9వ శతకం
David Warner : అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్ ప్రస్తుతం వివిధ టీ20 లీగుల్లో మాత్రం ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు బిగ్‌బాష్ లీగ్ 2025-26 ఆడుతున్నాడు. సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
కాగా.. టీ20ల్లో వార్నర్‌కు ఇది తొమ్మిదో సెంచరీ. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రిలీ రూసోలతో కలిసి వార్నర్ (David Warner) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(22), బాబర్ ఆజామ్ (11)లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
David Warner now holds the joint third place for most T20 tons 💪 pic.twitter.com/NiL1wvgTIu
— ESPNcricinfo (@ESPNcricinfo) January 3, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 65 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. వార్నర్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
KKR : బీసీసీఐ ఆదేశాలపై స్పందించిన కేకేఆర్.. మేము అతడిని వదిలివేస్తున్నాం..
ఆ తరువాత టిమ్ వార్డ్ (90; 49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ ఓవెన్ (45; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), నిఖిల్ చౌదరి (29 నాటౌట్; 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 206 పరుగుల లక్ష్యాన్ని హోబర్ట్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. సిడ్నీ బౌలర్లలో డేనియల్ సామ్స్ మూడు వికెట్లు తీశాడు.
130 not out. 65 balls.
Here’s the best of David Warner’s incredible #BBL15 hundred! pic.twitter.com/GperFoc4ye
— KFC Big Bash League (@BBL) January 3, 2026
