Big Bash League Warner equals Kohli in elite list with masterclass century
David Warner : అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్ ప్రస్తుతం వివిధ టీ20 లీగుల్లో మాత్రం ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు బిగ్‌బాష్ లీగ్ 2025-26 ఆడుతున్నాడు. సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
కాగా.. టీ20ల్లో వార్నర్‌కు ఇది తొమ్మిదో సెంచరీ. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రిలీ రూసోలతో కలిసి వార్నర్ (David Warner) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(22), బాబర్ ఆజామ్ (11)లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
David Warner now holds the joint third place for most T20 tons 💪 pic.twitter.com/NiL1wvgTIu
— ESPNcricinfo (@ESPNcricinfo) January 3, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 65 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. వార్నర్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
KKR : బీసీసీఐ ఆదేశాలపై స్పందించిన కేకేఆర్.. మేము అతడిని వదిలివేస్తున్నాం..
ఆ తరువాత టిమ్ వార్డ్ (90; 49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ ఓవెన్ (45; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), నిఖిల్ చౌదరి (29 నాటౌట్; 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 206 పరుగుల లక్ష్యాన్ని హోబర్ట్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. సిడ్నీ బౌలర్లలో డేనియల్ సామ్స్ మూడు వికెట్లు తీశాడు.
130 not out. 65 balls.
Here’s the best of David Warner’s incredible #BBL15 hundred! pic.twitter.com/GperFoc4ye
— KFC Big Bash League (@BBL) January 3, 2026