KKR : బీసీసీఐ ఆదేశాలపై స్పందించిన కేకేఆర్.. మేము అతడిని వదిలివేస్తున్నాం..
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను (KKR) కేకేఆర్ తమ జట్టు నుంచి విడుదల చేసింది.
KKR confirmed that Mustafizur Rahman has been released from their IPL squad
- బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను విడుదల చేసిన కేకేఆర్
- బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో
- అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటుందంటే
KKR : బీసీసీఐ సూచనల మేరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను తమ జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌కు ముందు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని BCCI/IPL ఆదేశించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి సూచనల మేరకు తగిన ప్రక్రియ, సంప్రదింపుల తర్వాత ఈ విడుదల జరిగింది. IPL నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఆటగాడిని బీసీసీఐ అనుమతిస్తుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము. ‘అని కేకేఆర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
Hardik Pandya : శతకంతో చెలరేగిన హార్దిక్ పాండ్యా.. లిస్ట్-ఏ క్రికెట్‌లో తొలి సెంచరీ
KKR Media Advisory. 🔽 pic.twitter.com/ZUZB620Uv7
— KolkataKnightRiders (@KKRiders) January 3, 2026
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి తలెత్తిన నేపథ్యంలో అక్కడి హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి నిషేదించాలనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని కేకేఆర్ ఫ్రాంఛైజీని కోరింది. ఈ క్రమంలోనే కేకేఆర్ అతడిని విడుదల చేసింది.
Washington Sundar : నువ్వేమైనా కోహ్లీ, రోహిత్ అనుకుంటివా..? సుందర్ నీకు అంత తలపొగరు ఎందుకు?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ జట్టు ముస్తాఫిజుర్ ను రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ముస్తాఫిజుర్ స్థానంలో ఏ ఆటగాడిని కేకేఆర్ తీసుకుంటుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.
