Washington Sundar : నువ్వేమైనా కోహ్లీ, రోహిత్ అనుకుంటివా..? సుందర్ నీకు అంత తలపొగరు ఎందుకు?
అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) నిరాకరించాడు.
Team India all rounder Washington Sundar Refuses Selfie Seeking Fans
- టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వీడియో వైరల్
- అభిమానులతో సెల్ఫీ నిరాకరణ
- మండిపడుతున్న నెటిజన్లు
Washington Sundar : మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక క్రికెటర్లను కొందరు దేవుళ్ల కంటే కూడా ఎక్కువగానే ఆరాధిస్తూ ఉంటారు. బయట ఎక్కడైన క్రికెటర్లు కనపడితే చాలు వారి చుట్టూ చేరిపోయి ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు అంటూ ఉంటారు. దీని వల్ల పలు సందర్భాల్లో ఇబ్బందులు పడిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అందుకనే వారు బయటకు వెళ్లిన సందర్భాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం.
ఇక తాజాగా టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. సుందర్ ఓ హోటల్ నుంచి బయటకు వస్తుండగా కొందరు అభిమానులు అతడిని చుట్టు ముట్టారు. సెల్పీలు, ఆటోగ్రాఫ్ ల కోసం ప్రయత్నించారు. అయితే.. సుందర్ మాత్రం వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. తన దారిలో అతడు ముందుకు సాగిపోయాడు.
Washington Sundar looks like a proper gentleman, but his attitude is on another level — even more than big names like Virat Kohli, Rohit Sharma, and Hardik Pandya. 😅🙏 pic.twitter.com/7lVDBGz66K
— Jara (@JARA_Memer) January 2, 2026
ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు సుందర్ కు మద్దతుగా పోస్టులు పెడుతుండగా, మరికొందరు మాత్రం అతడిని విమర్శిస్తున్నారు.
కోహ్లీ, రోహిత్ శర్మ అనుకుంటున్నావా? అంత తలపొగరు ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత ప్రైవసీ ఉంటుందని, ఎప్పుడూ వారిని కెమెరాలతో సెల్పీలు, ఆటోగ్రాఫ్‌లు అంటూ ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు.
ఇక సుందర్ టీమ్ఇండియా తరుపున 17 టెస్టులు, 28 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 42.1 సగటుతో 885 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 20.3 సగటుతో 365 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధశతకం ఉంది. ఇక టీ20ల్లో 254 పరుగులు చేశాడు. టెస్టుల్లో 36, వన్డేలు 29, టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.
Or may be he’s just not having a good day, don’t judge.
— Nishant Bhardwaj 🇮🇳 (@Nishant_Bliss) January 2, 2026
Too much attitude
— Development Pandey (@retweetman72) January 2, 2026
