Hardik Pandya : శతకంతో చెలరేగిన హార్దిక్ పాండ్యా.. లిస్ట్-ఏ క్రికెట్‌లో తొలి సెంచరీ
విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) శతకంతో చెలరేగాడు.
Hardik Pandya goes berserk with 68 ball 100 on Vijay Hazare Trophy return
- విజయ్ హజారే ట్రోఫీలో శతకంతో చెలరేగిన హార్దిక్ పాండ్యా
- లిస్ట్-ఏ క్రికెట్‌లో పాండ్యాకు ఇదే తొలి శతకం
Hardik Pandya : విజయ్ హజారే ట్రోఫీలో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దుమ్ములేపుతున్నాడు. బరోడా తరుపున బరిలోకి దిగిన పాండ్యా విదర్భతో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. కేవలం 68 బంతుల్లో అతడు సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు.
రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు శనివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. విదర్భ బౌలర్ల ధాటికి 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అమిత్ పాసీ (0), నిత్యా పాండే (15), ప్రియాన్షు మొలియా (16), అతిత్ షేత్ (21), జితేశ్ శర్మ (9) లు విఫలం అయ్యారు.
Arshdeep Singh : ఐదు వికెట్లతో చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్.. సిక్కిం పై పంజాబ్ అలవోక విజయం..
ఈ దశలో ఏడో స్థానంలో హార్దిక్ పాండ్య (133; 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్లు) బ్యాటింగ్ కు వచ్చాడు. తన సోదరుడు, కెప్టెన్ కృనాల్ పాండ్యా (23) పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
🚨 HARDIK PANDYA 133 RUNS FROM JUST 92 BALLS 🚨
– Baroda: 71/5
– No batter has scored more than 30 runs
– One man show by HardikGREAT NEWS FOR INDIA 🇮🇳 pic.twitter.com/nZ2McdNkK4
— Johns. (@CricCrazyJohns) January 3, 2026
ఈ క్రమంలో 44 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వేగం పెంచిన పాండ్యా మరో 24 బంతుల్లోనే మూడు అంకెల స్కోరు చేరుకోవడం గమనార్హం. కాగా.. లిస్ట్ ఏ క్రికెట్‌లో హార్దిక్ కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
భారత్ తరుపున 94 వన్డేలు ఆడిన పాండ్యా వీటితో కలిపి 119 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 2020లో కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పటి వరకు అదే అతడికి అత్యధిక స్కోరు కాగా.. తాజా మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు పాండ్యా ఫామ్‌లోకి రావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
