Arshdeep Singh : ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన అర్ష్‌దీప్ సింగ్‌.. సిక్కిం పై పంజాబ్ అల‌వోక విజ‌యం..

అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్ల‌తో (Arshdeep Singh) చెల‌రేగడంతో సిక్కిం పై పంజాబ్ అల‌వోక‌గా విజ‌యం సాధించింది.

Arshdeep Singh : ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన అర్ష్‌దీప్ సింగ్‌.. సిక్కిం పై పంజాబ్ అల‌వోక విజ‌యం..

Arshdeep Singh take 5 wickets Punjab win by 10 wickets against Sikkim

Updated On : January 3, 2026 / 12:33 PM IST
  • విజ‌య్ హ‌జారే ట్రోఫీలో చెల‌రేగిన అర్ష్‌దీప్ సింగ్
  • పంజాబ్ త‌రుపున బ‌రిలోకి
  • సిక్కింపై 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌

Arshdeep Singh : విజ‌య్ హ‌జారే ట్రోపీలో టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ చెల‌రేగాడు. పంజాబ్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అత‌డు శ‌నివారం సిక్కింతో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల‌తో దుమ్ములేపాడు. అత‌డి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం 22.2 ఓవ‌ర్ల‌లో 75 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

జైపూర్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణ‌యం స‌రైందే అని నిరూపిస్తూ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) చెల‌రేగిపోయాడు. ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇన్ స్వింగ్‌, ఔట్ స్వింగ‌ర్ల‌లో ప‌ట్ట‌ప‌గ‌లే సిక్కిం బ్యాట‌ర్ల‌కు చుక్కలు చూపించాడు.

BCCI : కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కు బీసీసీఐ కీల‌క ఆదేశాలు.. ఆ బంగ్లా ప్లేయ‌ర్‌ను రిలీజ్ చేయండి

అత‌డి ధాటికి సిక్కిం బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. అర్ష్‌దీప్‌తో పాటు సుఖ్‌దీప్ బజ్వా, మయాంక్ మార్కండే లు చెరో రెండు వికెట్లతో స‌త్తా చాట‌డంతో 80 ప‌రుగుల లోపే సిక్కిం కుప్ప‌కూలింది.

సిక్కిం బ్యాట‌ర్ల‌లో గురిందర్ సింగ్ (10), పల్జోర్ రైట్ (13), ఎండి సప్తుల్లా (10) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.

Washington Sundar : నువ్వేమైనా కోహ్లీ, రోహిత్ అనుకుంటివా..? సుంద‌ర్ నీకు అంత త‌ల‌పొగ‌రు ఎందుకు?

అనంత‌రం 76 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని పంజాబ్ 6.2 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (53 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగగా హర్నూర్ సింగ్ (22 నాటౌట్; 13 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు.