BCCI : కోల్‌కతా నైట్‌రైడర్స్ కు బీసీసీఐ కీలక ఆదేశాలు.. ఆ బంగ్లా ప్లేయర్‌ను రిలీజ్ చేయండి
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ (BCCI) ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.
BCCI asks KKR to release Mustafizur Rahman amid controversy
- ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్లను నిషేదించాలనే డిమాండ్లు
- బీసీసీఐ (bcci)కీలక నిర్ణయం
- కేకేఆర్‌కు కీలక ఆదేశాలు
BCCI : బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువుల పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను నిషేదించాలనే డిమాండ్లు దేశ వ్యాప్తంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన బంగ్లాదేశ్ ప్లేయర్‌గా అతడు రికార్డులకు ఎక్కాడు. ఈ ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ తరుపున ఏకైక ప్లేయర్ అతడే కావడం గమనార్హం.
Washington Sundar : నువ్వేమైనా కోహ్లీ, రోహిత్ అనుకుంటివా..? సుందర్ నీకు అంత తలపొగరు ఎందుకు?
డిమాండ్ల నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని సూచించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.
#WATCH | Guwahati | BCCI secretary Devajit Saikia says, “Due to the recent developments that are going on all across, BCCI has instructed the franchise KKR to release one of their players, Mustafizur Rahman of Bangladesh, from their squad and BCCI has also said that if they ask… pic.twitter.com/53oxuRcmZp
— ANI (@ANI) January 3, 2026
‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కేకేఆర్ ఫ్రాంచైజీ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ అతడికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఆటగాడిని ఎంచుకుంటామని ఫ్రాంఛైజీ కోరితే అందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుంది.’ అని దేవజిత్ సైకియా తెలిపారు.
