ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఖాతా తెరవనేలేదు. ఇతర ఐపీఎల్ జట్లు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కోహ్లీసేన మాత్రం పరాజయాలతో వెనుకబడిపోయింది.
ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతా తెరవనేలేదు. ఇతర ఐపీఎల్ జట్లు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కోహ్లీసేన మాత్రం పరాజయాలతో వెనుకబడిపోయింది. గెలుపు గుర్రాలుగా పిలిచే బెంగళూరు జట్టు ఆటగాళ్లంతా ఒక్కసారిగా కుంటుగుర్రాల్లా మారిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగే ఆటగాళ్ల అందరూ సత్తా చాటలేక చతికలపడ్డారు. ఏమైంది.. బెంగళూరుకు? ఊహించని రీతిలో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. బెంగళూరు జట్టులో ఏబి డెవిలియర్స్, పార్థీవ్ పటేల్ ఇలా అందరూ హీరోలే.. బౌలింగ్, బ్యాటింగ్.. అన్ని ఫార్మాట్లలో జట్టు బలంగానే ఉంది.
Read Also : గేల్ తో సెల్ఫీ దిగిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
ఆడిన 4 మ్యాచ్ ల్లో ఓటమే :
అయినప్పటికీ బెంగళూరును ఓటమి వెంటాడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ బెంగళూరు నాలుగు మ్యాచ్ లు ఆడితే నాలుగు మ్యాచ్ ల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గెలుపు.. అందని ద్రాక్షలా మారిపోయింది బెంగళూరుకు.. ఓటమి భారంతో బాధపడుతున్న రాయల్స్ బెంగళూరు జట్టు శుక్రవారం (ఏప్రిల్ 5, 2019) కోల్ కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
గెలుపు కోసం కసిగా :
కోల్ కతాతో జరుగబోయే మ్యాచ్ లోనైనా బోణీ కొట్టేందుకు కోహ్లీసేన కసిగా ఎదురుచూస్తోంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మొత్తం మూడు మ్యాచ్ లు ఆడితే.. రెండు మ్యాచ్ లు గెలిచింది.. ఒక మ్యాచ్ లో ఓడింది. బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో గెలిచి మరో విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు కోల్ కతా ఉవ్విళ్లూరుతోంది. ఐపీఎల్ సీజన్ పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ తలో మూడు మ్యాచ్ లు గెలిచి టాప్ 3 లో ఉంటే.. బెంగళూరు జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో దిగువకు పడిపోయింది.
బెంగళూరు అభిమానులను తీవ్ర నిరాశకు లోనయ్యేలా చేసింది. కోల్ కతాతో జరుగబోయే మ్యాచ్ లోనైనా కోహ్లీసేన కోలుకుంటుందా? అన్ని ఫార్మాట్లలో సమిష్టిగా రాణిస్తుందా? సొంతగడ్డపై బెంగళూరు సత్తా చాటుతుందా? కోల్ కతాను కట్టడి చేసి తొలి విజయంతో బోణీ కొడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే ఈ రోజు రాత్రి 8 గంటలకు కోల్ కతా, బెంగళూరు మ్యాచ్ చూడాల్సిందే.
Read Also : అస్గర్ ఆఫ్ఘన్ పై వేటు.. కెప్టెన్సీ నుంచి తొలగింపు