Kl Rahul
KL Rahul and Axar Patel ruled out of T20 Series India vs Westindies: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ దూరమయ్యారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల స్థానంలో రీతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలను జట్టులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 9న జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ గాయపడ్డాడు.
అక్షర్ ఇటీవల COVID-19 భారిన పడగా.. తర్వాత కోలుకున్నాడు. కానీ, తన గాయం నుంచి కోలుకున్న అక్షర్ ఫిట్‌నెస్ టెస్ట్ కోసం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. రాహుల్, అక్షర్‌లకు బదులుగా రీతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలకు ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టులో చోటు ఇచ్చింది.
భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు కోల్‌కతాలో జరగనున్నాయి. ఫిబ్రవరి 16న తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఫిబ్రవరి 18, 20 తేదీల్లో రెండు, మూడో మ్యాచ్‌లు జరుగుతాయి.
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రితురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా.