IND vs NED : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్‌.. ఒకే ఒక్క భార‌తీయుడు

India vs Netherlands : భార‌త వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా త‌రుపున వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యంత వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

KL Rahul

భార‌త వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా త‌రుపున వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యంత వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ‌త‌కం చేసి కేఎల్ రాహుల్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో భార‌త కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ మెగాటోర్నీలోనే అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో 63 బంతుల్లో రోహిత్ సెంచ‌రీ చేయ‌గా, తాజాగా కేఎల్ రాహుల్ 62 బంతుల్లోనే శత‌కం చేసి రికార్డును బ్రేక్ చేశాడు.

టీమ్ఇండియా త‌రుపున ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు..

కేఎల్ రాహుల్ – 62 బంతుల్లో నెద‌ర్లాండ్స్ పై 2023లో (నేటి మ్యాచ్‌లో)
రోహిత్ శర్మ – 63 బంతుల్లో అఫ్గానిస్థాన్ పై 2023లో
వీరేంద్ర సెహ్వాగ్ – 81 బంతుల్లో బెర్ముడా పై 2007లో
విరాట్ కోహ్లీ – 83 బంతుల్లో బంగ్లాదేశ్ పై 2011లో

Ravi Shastri : భార‌త ప్ర‌పంచ‌క‌ప్ అవ‌కాశాల‌పై ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మ‌రో 12 సంవ‌త్స‌రాలు ఆగాల్సిందే..!

రాహుల్ ద్రావిడ్ త‌రువాత‌..

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ల‌లో సెంచ‌రీ చేసిన ఏకైక ఆట‌గాడిగా రాహుల్ ద్ర‌విడ్ మాత్ర‌మే ఉండేవాడు. తాజాగా ఈ జాబితాలో కేఎల్ రాహుల్ వ‌చ్చి చేరాడు. 1999 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక పై ద్ర‌విడ్ 145 ప‌రుగులు చేశాడు. తాజాగా రాహుల్ 102 ప‌రుగులు చేశాడు.

వన్డే ప్రపంచకప్‌లో భారత వికెట్ కీప‌ర్లు సాధించిన అత్యధిక స్కోర్లు..

రాహుల్ ద్రవిడ్ – 145 ప‌రుగులు శ్రీలంక పై 1999లో
కేఎల్‌ రాహుల్ – 102 ప‌రుగులు నెద‌ర్లాండ్స్ పై 2023లో ( నేటీ మ్యాచులోనే)
కేఎల్ రాహుల్ – 97 నాటౌట్ ఆస్ట్రేలియా పై 2023లో
ఎంఎస్ ధోని – 91నాటౌట్ శ్రీలంక పై 2011లో
ఎంఎస్‌ ధోని – 85 నాటౌట్ జింబాబ్వే పై 2015లో

ODI World Cup 2023 : సెమీ ఫైన‌ల్‌కు ముందు ద‌క్షిణాఫ్రికాకు బిగ్ షాక్‌..! త‌ప్ప‌ని తిప్ప‌లు..!

నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 410 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (128 నాటౌట్ ; 94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (102; 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) సెంచ‌రీలు చేశారు. రోహిత్ శ‌ర్మ (61), శుభ్‌మ‌న్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో బాస్ డి లీడే రెండు వికెట్లు తీయ‌గా, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు