KL Rahul Most Bizarre Dismissal in India A vs Australia A Match
టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో మరోసారి తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం రెండు అంకెల స్కోరు అందుకున్నాడు. 44 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 10 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ ఔటైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 18 ఓవర్‌ను కోరి రోకిసియోలి వేశాడు. తొలి బంతిని రాహుల్ డిఫెండ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బాల్ కాస్త బౌన్స్ కావడంతో పాటు లెగ్ సైడ్ టర్న్ అవుతుండడంతో బ్యాట్‌తో కాకుండా ప్యాడ్లతో ఆడాలని అనుకున్నాడు.
అయితే.. బంతి రాహుల్ ఎడమ ప్యాడ్‌ను తాకుతూ కాళ్ల మధ్య నుంచి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో అతడు షాక్‌కు గురి అయ్యాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో రాహుల్‌కు కౌంటర్లు వేస్తున్నారు. పేలవ ఫామ్‌లో జట్టులో చోటు కోల్పోయిన రాహుల్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా కంటే ముందే ఆస్ట్రేలియాకు వచ్చాడు.
భారత్-ఏ జట్టు తరుపున ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. నవంబర్ 22న ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఆడడం లేదు. ఈ క్రమంలో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే.. రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలం కావడం టీమ్‌మేనేజ్‌మెంట్‌ని ఆలోచనల్లో పడేసింది.
West Indies : ప్లేయర్ పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీరియస్.. రెండు మ్యాచుల నిషేదం..
“Don’t know what he was thinking!”
Oops… that’s an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz
— cricket.com.au (@cricketcomau) November 8, 2024