KL Rahul : లండ‌న్ నుంచి వ‌చ్చిన కేఎల్ రాహుల్.. ఐపీఎల్ ఆడేందుకేనా?

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయ‌ప‌డిన టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ లండ‌న్ నుంచి తిరిగొచ్చాడు.

KL Rahul return to India eyes IPL 2024 comeback after injury setback

Rahul : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయ‌ప‌డిన టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ లండ‌న్ నుంచి తిరిగొచ్చాడు. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్ తొడ కండ‌రాల గాయం బారిన ప‌డ్డాడు. దీంతో మిగిలిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల‌కు అత‌డు దూరం అయ్యాడు. మెరుగైన చికిత్స కోసం లండ‌న్‌కు వెళ్లాడు. అక్క‌డ ప్ర‌త్యేక వైద్యుల‌తో చికిత్స చేయించుకుని ఆదివారం తిరిగి వ‌చ్చాడు.

బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)కి వెళ్లి త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల‌ని రాహుల్ బావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎన్‌సీఏ గ‌నుక అత‌డికి క్లియ‌రెన్స్ ఇస్తే.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో రాహుల్ ఆడ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Viral Video : దీంతో కూడా ఆడొచ్చ‌ని అప్ప‌ట్లో తెలిసుంటేనా..? ఎప్పుడో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌ను అయ్యేవాడిని!

ఇంకా గాయం నుంచి రాహుల్ పూర్తిగా కోలుకోలేద‌ని, ఐపీఎల్ ఆడితే అత‌డు ఇబ్బందులు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఐపీఎల్ ముగిసిన త‌రువాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ రాహుల్ విష‌యంలో ఎలాంటి తొంద‌ర పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి సిద్ధంగా లేన‌ట్లు స‌మాచారం. రాహుల్ బ్యాట‌ర్‌గానే కాకుండా వికెట్ కీప‌ర్‌గానూ పొట్టి ఫార్మాట్‌లో కీలకం కానున్నాడు.

‘లండ‌న్‌లో వైద్య బృందాన్ని సంప్ర‌దించిన అనంత‌రం ఆదివారం కేఎల్ రాహుల్ భార‌త్‌కు వ‌చ్చాడు. ఎన్‌సీఏకి వెళ్లాడు. అక్క‌డ ఫిట్‌నెస్‌కు సంబంధించిన స‌ర్టిఫికెట్‌ను అందుకుంటాడు. ఐపీఎల్‌లో త‌న సామ‌ర్థ్యాన్ని నిరూపించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. వికెట్ కీప‌ర్‌గా, బ్యాట‌ర్‌గా అత‌డు టీ20 క‌ప్‌లో సేవ‌లందించేందుకు ముందు వ‌ర‌స‌లో ఉంటాల‌ని భావిస్తున్నాడు. ‘అని క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

CSK : ఇలాగైతే సీఎస్‌కే క‌ప్ కొట్ట‌డం క‌ష్ట‌మే!.. ఐపీఎల్ ఆరంభం కాక‌ముందే ఇలా..

కాగా.. ఐపీఎల్‌లో రాహుల్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ల‌క్నో త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు