KL Rahul Salary Net Worth Assets IPL Income And More
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ హవా కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. 53 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కేఎల్ రాహుల్ ఐపీఎల్ ద్వారా ఎంత సంపాదించాడు. అతడి ఆస్తి వివరాలు ఏమిటో ఓ సారి చూద్దాం..
ఐపీఎల్ ద్వారా 112 కోట్లకు పైనే..
2013లో కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు ఐపీఎల్ ద్వారా రూ.112 కోట్లు సంపాదించాడు. 2013లో అతడిని రూ.10లక్షలకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. 2014, 15 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. అతడి ఎస్ఆర్‌హెచ్ రూ కోటి చొప్పున చెల్లించింది. మళ్లీ 2016,2017 సీజన్లలో ఆర్‌సీబీ తరుపున ఆడాడు. ఆర్‌సీబీ కూడా అతడికి రూ.కోటి చొప్పున చెల్లించింది.
2018లో రాహుల్ దశ తిరిగింది. వేలంలో అతడిని పంజాబ్ రూ.11కోట్లకు కొనుగోలు చేసింది. 2018 నుంచి 2021 వరకు నాలుగు సీజన్ల పాటు అతడు పంజాబ్‌కు ఆడాడు. ఆ తరువాత 2022లో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.17 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో తరుపున అతడు మూడు సీజన్లు ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు. అతడిని ఢిల్లీ వేలంలో రూ.14 కోట్లకు దక్కించుకుంది.
బీసీసీఐ నుంచి కోట్లలో జీతం..
కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ నుంచి కోట్ల రూపాయల జీతం కూడా వస్తుంది. గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్నాడు. అందువల్ల అతడికి ప్రతి సంవత్సరం రూ.5 కోట్ల జీతం వస్తుంది. దీనితో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కూడా బాగా సంపాదిస్తాడు. రాహుల్ అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
ఓ నివేదిక ప్రకారం కేఎల్ రాహుల్ నికర ఆస్తులు దాదాపు రూ.101కోట్లు. ముంబై, బెంగళూరులో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌కు కార్లు అంటే పిచ్చి. అతడి కార్ల గ్యారేజీలో లంబోర్గిని హురాకాన్ స్పైడర్, ఆస్టన్ మార్టిన్ DB11, BMW 5 సిరీస్, ఆడి R8 ఉన్నాయి.