KL Rahul : కేఎల్ రాహుల్‌కు ల‌క్నో షాక్‌.. కెప్టెన్‌గా వ‌ద్దే వ‌ద్దు.. ప్లేయ‌ర్‌గా అయితే ఓకే!

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌కు షాకిచ్చింది.

KL Rahul Set To Be Axed As LSG Captain Report

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు మెగా వేలం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేలంలో స్టార్ ఆట‌గాళ్ల‌ను సొంతం చేసుకుని జ‌ట్ల‌ను ప‌టిష్టం చేసుకునేందుకు అన్ని ప్రాంఛైజీలు ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎంత మందిని రిటైన్ చేసుకోవ‌చ్చు అనే విష‌యం పై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ను రిటైర్ చేసుకోనుందని స‌మాచారం.

అయితే.. కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి అత‌డిని త‌ప్పించనున్న‌ట్లుగా తెలుస్తోంది. ఓ బ్యాట‌ర్‌గానే అత‌డిని జ‌ట్టులో కొన‌సాగించాల‌ని ల‌క్నో మేనేజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు ఆ జ‌ట్టు స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కెప్టెన్‌గా ఎవ‌రని ఎంచుకోనున్నారు అనే దానిపై కొంత సందిగ్థ‌త ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు నికోల‌స్ పూర‌న్‌తో పాటు ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. వీరిద్ద‌రితో ఎవ‌రో ఒక‌రు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Sunil Gavaskar : జైషా పై ఆరోప‌ణ‌లు.. ఘాటుగా స్పందించిన సునీల్ గ‌వాస్క‌ర్‌..

ఇదిలా ఉంటే.. సోమ‌వారం కేఎల్ రాహుల్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సీఈఓ సంజీవ్ గోయెంకాతో స‌మావేశం అయ్యాడు. కెప్టెన్సీ, రిటెన్ష‌న్ వంటి అంశాల‌పై ఇద్ద‌రు చ‌ర్చించారు. తాను ల‌క్నోతోనే కొన‌సాగ‌నున్న‌ట్లు గోయెంకాతో రాహుల్ చెప్పాడు.

‘గోయెంకాకు రాహుల్‌పై పూర్తి విశ్వాసం ఉంది. అతను ఆటగాడిగా కొనసాగించబడతాడు. కానీ జట్టుకు కెప్టెన్‌గా కనిపించడు. బ్యాట‌ర్‌గా జ‌ట్టుకు మ‌రింత‌గా ఉప‌యోగ‌ప‌డాల‌ని అత‌డు కోరుకుంటున్నాడు. మేం కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తున్నాం. కృనాల్ పాండ్యా, నికోల‌స్ పూర‌న్‌లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు.’ అని లక్నోఫ్రాంచైజీకి చెందిన‌ సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.

Sanju Samson : రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు సంజూ శాంస‌న్ గుడ్‌బై..? ఆర్ఆర్ పోస్ట్‌..

ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిన త‌రువాత కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో మైదానంలోనే గోయెంకా కోపంగా మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో రాహుల్ ల‌క్నోని వీడి వేరే ప్రాంఛైజీ వెల్ల‌నున్నాడు అని ఊహాగానాలు వ‌చ్చాయి. సోమ‌వారం గోయెంకాను రాహుల్ క‌ల‌వ‌డంతో వీటికి తెర‌ప‌డిన‌ట్లే. అయితే.. వేలానికి ఇంకా చాలా స‌మ‌యం ఉండ‌డంతో ఆ లోపు ఏమైనా జ‌ర‌గొచ్చున‌ని ప‌లువురు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు