Sanju Samson : రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్ గుడ్‌బై..? ఆర్ఆర్ పోస్ట్..
ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో దివంగత షేన్‌వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది.

Sanju Samson to leave Rajasthan Royals
Sanju Samson : ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో దివంగత షేన్‌వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తరువాత మరోసారి కప్పును ముద్దాడలేదు. కెప్టెన్లు మార్చినా, ఆటగాళ్లను మార్చినా ఎన్ని ప్రయోగాలు చేసినా మరోసారి కప్పును సొంతం చేసుకోవాలనుకునే కలను నిజం చేసుకోలేకపోయింది. ఐపీఎల్ 2025లో ఎలాగైనా విజేతగా నిలవాలని ప్రణాళికలను రచిస్తోంది. ఈ సీజన్ కన్నా ముందు జరగనున్న మెగా వేలం పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
కొత్త కెప్టెన్‌ను నియమించాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ జట్టును వీడనున్నాడు అనే టాక్ నడుస్తోంది. కాగా.. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సంజూ శాంసన్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. మేజర్ మిస్సింగ్ అని అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది.
అంతేకాదండోయ్.. ఏడుస్తున్న ఎమోజీని జత చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని బట్టి చూస్తేంటే రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ శాంసన్ వీడడం ఖాయంగా కనిపిస్తుందని పలువురు అంటున్నారు.
2018 నుంచి సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. 2021 నుంచి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి నాయకత్వంలో ఆర్ఆర్ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్‌లో 167 మ్యాచులు ఆడిన సంజూశాంసన్ 4419 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు కూడా ఉన్నాయి. ఒక వేళ అతడు ఆర్ఆర్‌ను వీడి మెగా వేలానికి వస్తే మాత్రం అతడిని కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు.
major missing ?? pic.twitter.com/JLkjh9jjW7
— Rajasthan Royals (@rajasthanroyals) August 23, 2024