PAK vs BAN : వీళ్లు మారరు.. బంగ్లా పై పాక్ ఓటమి.. టీమ్ఇండియానే కారణమన్న పాక్ మాజీ ఆటగాడు.. ఎలాగంటే..?
పాకిస్తాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఓడిపోయింది.

Behind Pakistan Loss To Bangladesh Ramiz Raja Stunning India Factor
PAK vs BAN 1st test : పాకిస్తాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఓడిపోయింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాక్ జట్టు ఓడిపోవడానికి పరోక్షంగా టీమ్ఇండియానే కారణం అని ఆ జట్టు మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నాడు. అంతేకాదండోయ్ ప్లేయర్ ఎలెవన్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
‘పాక్ తుది జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయి. ఉప ఖండ పిచ్‌లపై ముఖ్యంగా స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం సరైంది కాదు. మా ఫాస్ట్ బౌలర్ల పై ఆధారపడే శకం ఎప్పుడో ముగిసింది. వారిలో ఆత్మవిశ్వాసం లోపించింది. గత ఆసియా కప్‌లో భారత జట్టు మా పేసర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. సీమింగ్ అనుకూలంగా ఉన్న పిచ్‌లపై మా పేసర్లను వారు (భారత్) దెబ్బతీశారు. ఆ తరువాత నుంచి ఇతర జట్లు మా బౌలింగ్‌ను సులువుగా ఆడేస్తున్నాయి. మా బౌలింగ్ వేగం తగ్గిపోయింది. మా బౌలర్లు రాణించాలంటే ఉన్న ఏకైక మార్గం తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడమే. తొలి టెస్టులో మా బౌలర్ల కంటే బంగ్లా పేసర్లు నాణ్యమైన ప్రదర్శన చేశారని.’ రమీజ్ చెప్పుకొచ్చాడు.
Womens T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
కెప్టెన్ షాన్ మసూద్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాడని తెలిపాడు. ప్రస్తుతం కెప్టెన్ ఓటమి బాధలో ఉన్నాడని అన్నాడు. ఇలాగే ఉంటే ఆస్ట్రేలియాలో పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయన్నాడు. ఇలాగే ఆడితే అక్కడ పాక్ సిరీస్ గెలవడం అసాధ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇక కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ షాన్ మసూద్ దారుణంగా విఫలం అయ్యాడని అన్నారు. అతడు ఏ ప్రాతిపదికన నలుగురు పేసర్లను ఎంచుకున్నాడో తనకు అర్థం కాలేదన్నాడు. మసూద్ నాయకత్వ నైపుణ్యాలను పెంచుకోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుగు అవ్వాలని, లేదంటే జట్టు నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నాడు. ఇక చేయాల్సింది సిరీస్‌ను ఓడిపోకుండా చూసుకోవడమే. ఇందుకోసం రెండో టెస్టు మ్యాచులో పాక్ తప్పక విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నాడు.
PAK vs BAN : ఓరి నాయనో.. షకీబ్‌కు కోపం తెచ్చావుగా.. జస్ట్ మిస్.. తల పగిలేదిగా రిజ్వాన్..!