Womens T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ జట్టును ప్రకటించింది.

Australia announce 15 member squad for ICC Womens T20 World Cup
Womens T20 World Cup : అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ జట్టును ప్రకటించింది. 15 మందిని ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ గా అలిస్సా హీలీ వ్యవహరించనున్నారు. వైస్ కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్. పేస్ బౌలర్ తైలా వ్లేమింక్‌కు చోటు దక్కింది. మెగ్ లానింగ్ రిటైర్మెంట్ తరువాత తొలిసారి మెగా టోర్నీలో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది.
6 సార్లు విజేత అయిన ఆస్ట్రేలియా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్ ఈ సారి కూడా విజయం సాధించి వరుసగా నాలుగు సార్లు టీ20 ప్రపంచకప్ సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఆరాటపడుతోంది.
‘ప్రపంచ కప్‌కు ముందు ఎంపిక కోసం మా మొత్తం కాంట్రాక్ట్ జాబితాను అందుబాటులో ఉంచడం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి. ఇది నిజంగా స్థిరమైన, సమతుల్య జట్టు.’ అని సెలెక్టర్ షాన్ ఫ్లెగ్లర్ చెప్పారు. ప్రపంచ కప్‌లో తొలిసారి అలిస్సాహీలీ నాయకత్వంలో ఆస్ట్రేలియా ఆడనుంది. ఆమె పై పూర్తి నమ్మకం ఉంది. ఆసీస్‌ను విజేతగా నిలుపుతుందనే ఆశాభావాన్ని ప్లెగ్గర్ వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..
అలిస్సా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డ్‌నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లిస్ పెర్రీ, మేగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్, టైలా వ్లామిన్.
PAK vs BAN : ఓరి నాయనో.. షకీబ్‌కు కోపం తెచ్చావుగా.. జస్ట్ మిస్.. తల పగిలేదిగా రిజ్వాన్..!
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 10 దేశాలు కప్పు కోసం పోటీపడనున్నాయి. మొత్తం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
JUST IN: Australia will be bringing the heat as they chase a fourth #T20WorldCup in a row in Dubai ???
— cricket.com.au (@cricketcomau) August 26, 2024