Kohli bowling
Bengaluru : వన్డే ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. విరాట్ కోహ్లీ ఒక వికెట్ తీసుకోవడంతో అతని భార్య, సినీనటి అనుష్కా శర్మతో సహా క్రికెట్ అభిమానులు లేచి నిలబడి నవ్వుతూ కేరింతలు కొట్టారు. క్రికెట్ ప్రపంచ కప్ 2023 దీపావళి నాడు టోర్నమెంట్‌లోని తమ చివరి లీగ్ గేమ్‌లో ఒక వికెట్ తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీకి రెండు ఓవర్లు ఇవ్వాలని రోహిత్ శర్మను బెంగళూరు చిన్నస్టేడియంలోని క్రికెట్ అభిమానులు కోరడం కనిపించింది.
ALSO READ : IND vs NED : నెదర్లాండ్స్ పై టీమ్ ఇండియా ఘన విజయం.. తొమ్మిదికి తొమ్మిది..
ఆదివారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచ కప్ 2023లో భారతదేశం చివరి లీగ్ గేమ్‌ను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎం చిన్నస్వామి స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రేక్షకులు బాణసంచా కాల్చారు. ఊహించినట్లుగానే ఎం చిన్నస్వామి స్టేడియంకు దారితీసే వీధులన్నీ జనంతో రద్దీగా మారాయి. విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీ రికార్డును బద్దలు కొట్టడంతో గోడలన్నీ పోస్టర్లతో నిండిపోయాయి.
ALSO READ : Delhi Thick Smog : దీపావళి ఎఫెక్ట్, ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు
బెంగుళూరులో నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌లో మూడోసారి అర్ధశతకం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక వికెట్ తీశారు. బెంగళూరు ప్రేక్షకులు కెప్టెన్ రోహిత్ శర్మను విరాట్ కోహ్లీకి ఒకటి లేదా రెండు ఓవర్లు బౌలింగ్ ఇవ్వాలని కోరారు.ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ కో బౌలింగ్ దో అంటూ నినాదాలు వినిపించాయి.
https://twitter.com/Trend_VKohli/status/1723717778551755226
Kohli ko bowling do part 3 pic.twitter.com/sWgCW5luXS
— A (@_shortarmjab_) November 12, 2023