Virat Kohli : 500 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లి.. డేవిడ్ వార్న‌ర్ రికార్డు స‌మం

పరుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది.

Virat Kohli 500 Runs in IPL : పరుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న కోహ్లి 500 ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా కోహ్లి ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 44 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 70 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో కోహ్లి 500 ప‌రుగుల మార్క్‌ను చేరుకోవ‌డం ఇది ఏడోసారి. ఈ క్ర‌మంలో.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 500 ఫ్ల‌స్ ప‌రుగుల సీజ‌న్ క‌లిగిన డేవిడ్ వార్న‌ర్ రికార్డును కోహ్లి స‌మం చేశాడు. వీరిద్ద‌రి త‌రువాత శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. వీరిద్ద‌రు నాలుగు ఐపీఎల్ సీజ‌న్ల‌లో 500 ఫ్ల‌స్ ప‌రుగుల‌ను సాధించారు.

MS Dhoni : ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. అత్య‌ధిక విజ‌యాల్లో భాగ‌స్వామ్యం

ఈ సీజ‌న్‌లో మొద‌టి ఆట‌గాడు..

కాగా.. ఈ సీజ‌న్‌లో 500 ప‌రుగుల మార్క్‌ను అందుకున్న మొద‌టి ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కు ఎక్కాడు. 10 మ్యాచుల్లో 147.49 స్ట్రైక్‌రేటుతో 71.43 సగ‌టుతో 500 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం, నాలుగు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ అత‌డి వ‌ద్దే ఉంది. అత‌డి త‌రువాతి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. గైక్వాడ్ 9 మ్యాచుల్లో 447 ప‌రుగులు చేశాడు.

ఆ త‌రువాత వ‌రుస‌గా సాయి సుద‌ర్శ‌న్ (10 మ్యాచుల్లో 418), సంజూ శాంస‌న్ (9 మ్యాచుల్లో 385), కేఎల్ రాహుల్ (9 మ్యాచుల్లో 378), రిష‌బ్ పంత్ (10 మ్యాచుల్లో 371) లు ఉన్నారు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు వినూత్నంగా జ‌ట్టును ప్ర‌కటించిన న్యూజిలాండ్‌.. కెప్టెన్‌గా కేన్ మామ‌..

ట్రెండింగ్ వార్తలు