T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు వినూత్నంగా జ‌ట్టును ప్ర‌కటించిన న్యూజిలాండ్‌.. కెప్టెన్‌గా కేన్ మామ‌..

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను వినూత్నంగా వెల్ల‌డించింది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు వినూత్నంగా జ‌ట్టును ప్ర‌కటించిన న్యూజిలాండ్‌.. కెప్టెన్‌గా కేన్ మామ‌..

pic credit @ blackcapsnz

Updated On : April 29, 2024 / 1:46 PM IST

T20 World Cup 2024 – New Zealand : టీ20 ప్ర‌పంచక‌ప్ 2024కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. భార‌తకాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. అయితే.. మే 1 లోగా మెగాటోర్నీలో పాల్గొనే జ‌ట్టును ప్ర‌క‌టించాల‌ని ఇప్ప‌టికే ఐసీసీ డెడ్‌లైన్ విధించింది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టును ఎంపిక చేసే ప‌నిలో సెల‌క్ట‌ర్లు ఉన్నారు. కాగా.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను వినూత్నంగా వెల్ల‌డించింది.

ఇద్ద‌రు చిన్నారులు మీడియా స‌మావేశంలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. న్యూజిలాండ్‌కు చెందిన చిన్నారులు ఆంగ‌స్‌, మ‌టిల్దా లు కేన్ విలియమ్స‌న్ సారథ్యంలో కివీస్ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో బ‌రిలోకి దిగ‌నుంద‌ని చెప్పారు. 15 మంది గ‌ల జ‌ట్టులో సీనియ‌ర్లు, జూనియ‌ర్ల మేళ‌వింపుతో ఉంది. పెద్ద‌గా సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఏమీ తీసుకోలేదు. ఊహించినట్లుగానే ఫామ్‌లేమీతో ఇబ్బందులు ప‌డుతున్న ఆటగాళ్లపై వేటు వేసింది.

IPL 2024 : రిషబ్ పంత్‌కు బిగ్‌షాక్‌.. ఒక మ్యాచ్‌ నిషేధం తప్పదా.. ఎందుకంటే..?

 

View this post on Instagram

 

A post shared by BLACKCAPS (@blackcapsnz)

ఇక గాయాలతో ఇబ్బంది ప‌డుతున్న పేస‌ర్‌ కైల్ జేమిసన్, ఆల్‌రౌండర్ ఆడమ్ మిల్నే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు దూరం అయ్యారు. కుర్రాడు ర‌చిన్ ర‌వీంద్ర‌, మ్యాట్ హెన్రీ ల‌కు స్థానం ద‌క్కింది. బెన్ సియర్స్‌ను ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. కాగా.. విలియ‌మ్స‌న్‌కు ఆట‌గాడిగా ఇది ఆరో, కెప్టెన్‌గా నాలుగో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కానుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ త‌మ తొలి మ్యాచ్‌ను జూన్ 7న గ‌యానా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో ఆడ‌నుంది. 20 జ‌ట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో కివీస్ గ్రూప్‌-సిలో ఉంది. కివీస్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, వెస్టిండీస్, ఉగాండా, పాపువా న్యూగినియా లు ఉన్నాయి.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేసిన కివీస్ జ‌ట్టు ఇదే..

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథి.

ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.

Gautam Gambhir : పంజాబ్‌తో మ్యాచ్‌.. గంభీర్‌కు కోప‌మొచ్చింది.. అంపైర్‌తో గొడవ!

 

View this post on Instagram

 

A post shared by BLACKCAPS (@blackcapsnz)