ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డు

  • Publish Date - May 14, 2019 / 04:13 PM IST

భారీ అంచనాలతో ఐపీఎల్-2019లోకి ఎంట్రీ ఇచ్చి పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశలోనే బయటకు వచ్చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉండగా..  సీజన్‌లో కేవలం ఐదు మ్యాచుల్లో మాత్రం నెగ్గి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమిపాలైనా కోహ్లీ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ముగిసే సమాయానికి మొత్తం లీగ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్‌లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. 5412 పరుగులతో ఈ లిస్ట్‌లో మొదటిస్థానం దక్కించుకున్నాడు. తర్వాతి స్థానంలో 5,368 పరుగులతో సురేశ్ రైనా ఉన్నాడు.