క్రికెట్ ఫీల్డ్‌లో విషాదం : యువ క్రికెటర్ హఠాన్మరణం

  • Publish Date - January 16, 2019 / 04:42 AM IST

కోల్‌కతాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఫీల్డ్‌లో వార్మప్‌ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తూ 21ఏళ్ల యువ క్రికెటర్‌ అనికేత్ శర్మ మృతి చెందాడు. గుండెపోటుతో అతడి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. స్థానిక పైక్‌పారా స్పోర్ట్స్‌ క్లబ్‌ తరపున క్రికెట్‌ ఆడుతున్న అనికేత్ రోజూలాగే 2019, జనవరి 15వ తేదీ మంగళవారం కూడా ప్రాక్టీస్ కోసం వచ్చాడు. గ్రౌండ్‌లో ముమ్మరంగా వార్మప్‌ చేస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని వెంటనే సిటీ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే అనికేత్ మృతి చెందినట్లు చెప్పారు. అనికేత్ హఠాన్మరణంతో సహచరులు షాక్ అయ్యారు. కళ్ల ముందే స్నేహితుడు కుప్పకూలడం తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు.

లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ అయిన అనికేత్ ఆల్ రౌండర్. బౌలింగ్‌, పీల్డింగ్ కూడా బాగా చేస్తాడని అతడి కోచ్‌ చెప్పాడు. అంకిత్ మంచి టాలెంటెడ్, ప్రామిసింగ్ క్రికెటర్ అని కితాబిచ్చాడు. 2018లో తమ క్లబ్‌‌లో చేరాడని తెలిపాడు. అతడికి మంచి ఫ్యూచర్ ఉందన్నాడు. అనికేత్ మృతిని నమ్మలేకపోతున్నామన్నాడు. క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అనికేత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. జనవరి 17వ తేదీ గురువారం మిలాన్ సమితితో జరిగే మ్యాచ్‌లో అనికేత్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం అతడు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. అనికేత్ మృతితో మ్యాచ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు.