×
Ad

Kris Srikkanth : భార‌త్ చేతిలో ఘోర ప‌రాజ‌యం నుంచి త‌ప్పించుకోవాంటే ఈ ఒక్క ప‌ని చేయండి.. పాక్ జ‌ట్టుకు శ్రీకాంత్ సూచ‌న‌..

పీసీబీ చీఫ్ మోసిన్ న‌ఖ్వి చేసిన వ్యాఖ్య‌ల పై శ్రీకాంత్ (Kris Srikkanth) సెటైర్లు వేశాడు.

Kris Srikkanth jokingly urged Pakistan to skip the T20 World Cup to avoid the embarrassment defeat by India

Kris Srikkanth : టీ20 క్రికెట్‌లో భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉంద‌ని, ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ప్రారంభ‌మ‌య్యే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని టీమ్ఇండియాను ఎదుర్కొనేందుకు అన్ని జ‌ట్లు భ‌య‌ప‌డ‌తాయ‌ని మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ తెలిపారు.

బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ బెదిరించిన సంగ‌తి తెలిసిందే. బంగ్లాదేశ్ ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పించిన క్ర‌మంలో ఆదేశానికి బాస‌ట‌గా పీసీబీ చీఫ్ మోసిన్ న‌ఖ్వి వ్యాఖ్య‌లు చేశాడు. టోర్న‌మెంట్‌లో పాక్ ఆడే విష‌యం పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పాడు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కార‌మే తాము న‌డుచుకుంటామ‌ని అన్నాడు.

Jasprit Bumrah : భావోద్వేగానికి లోనైన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేదు.. 6 నెల‌లు అన్నారు గానీ..

న‌ఖ్వి చేసిన ఈ వ్యాఖ్య‌ల పై శ్రీకాంత్ సెటైర్లు వేశాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్ ఆడ‌కుంటేనే ఆ జ‌ట్టుకు మంచిద‌ని చెప్పుకొచ్చాడు. ఒక‌వేళ ఆడితే మాత్రం అప్పుడు టీమ్ఇండియా చేతిలో ఘోర ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌స్తుంద‌న్నాడు.

శ్రీకాంత్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో మాట్లాడుతూ.. ‘భార‌త్ రెండో టీ20 మ్యాచ్‌లో 209 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. మూడో టీ20 మ్యాచ్‌లో 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 10 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. ఇంత గొప్ప ఫామ్‌లో ఉన్న భార‌త్‌ను చూసి చాలా జ‌ట్లు మెగాటోర్నీకి రావ‌డానికి భ‌య‌ప‌డ‌తాయి. క‌ప్పు మీరే ఉంచుకోండి.’ అని అంటాయ‌ని తెలిపాడు.

IND vs NZ : ఈ మ్యాచ్ పోతే పోయింది.. ఆ మ్యాచ్‌లో మేమే గెలుస్తాం.. మా దృష్టంతా దానిపైనే.. మిచెల్ సాంట్న‌ర్ కామెంట్స్..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భార‌త్‌, పాక్ జ‌ట్లు కొలంబో వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాక్ జ‌ట్టు ఈ మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యం పాల‌వుతుంద‌న్నాడు. అప్పుడు ఆ జ‌ట్టు ఇజ్ఞ‌త్ మొత్తం పోతుంద‌ని, దాని కన్నా ఆ జ‌ట్టు టోర్న‌మెంట్ ఆడ‌కుండా ఉండేందుకు ఓ సాకును వెతుక్కోవాల‌ని సూచించాడు. ఇక టీమ్ ఇండియా గురించి మాట్లాడుతూ.. టీ20 క్రికెట్‌లో ఈ ర‌క‌మైన హిట్టింగ్ చేసే జ‌ట్టును తాను ఇంత‌క‌ముందు ఎన్న‌డూ చూడ‌లేద‌న్నాడు.