Kuldeep Yadav Gets Engaged To Childhood Friend Vanshika
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికను పెళ్లి చేసుకోబోతున్నాడు. కుల్దీప్, వన్షికల నిశ్చితార్థం బుధవారం జరిగింది. లక్నోలోని ఓ హోటల్‌లో ఈ నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఇరు కుటుంబాలు, దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరు కాగా.. కుల్దీప్ యాదవ్, వన్షికలు ఉంగరాలను మార్చుకున్నారు. టీమ్ఇండియా యువ ఆటగాడు రింకూ సింగ్ ఈ వేడుకకు హాజరు అయ్యాడు.
Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).
– Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
వన్షిక ఎవరు?
కుల్దీప్ యాదవ్ చిన్ననాటి స్నేహితురాలు వన్షిక. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని శ్యామ్ నగర్‌లో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఆమె ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు కాగా.. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు కుల్దీప్ యాదవ్ ఏకైక స్పిన్నర్‌గా జట్టులో చోటు సంపాదించాడు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తరువాతనే కుల్దీప్ పెళ్లి చేసుకోనున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ను ఆడనుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది.