Virat Kohli-Rajat Patidar : రజత్ పాటిదార్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ.. ఆనందంలో ఆర్‌సీబీ కెప్టెన్ ఏం చేశాడంటే..?
కెప్టెన్ రజత్ పాటిదార్‌కు కోహ్లీ ఓ బహుమతిని ఇచ్చాడు.

Courtesy BCCI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ ఒళ్లో వాలింది. గజినీ మహమ్మద్ దండయాత్ర చేసినట్లుగా ఆర్‌సీబీ 17 సార్లు ఐపీఎల్ టైటిల్ కోసం విఫలయత్నం చేసింది. ఎట్టకేలకు 18వ సీజన్‌లో టైటిల్‌ను సొంతం చేసుకుంది.
రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాల కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ ను అందుకోలేని ఆర్‌సీబీ.. యువ ఆటగాడు రజత్ పాటిదార్ నాయకత్వంలో మొదటి సారే కప్పును ముద్దాడింది. ఆర్‌సీబీ విజయం సాధించిన తరువాత ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు.
Krunal Pandya : చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
“What a turnaround. Injury replacement to IPL winning captain”
Kohli appreciating captain Rajat Patidar and gifted his bat him 🥹 pic.twitter.com/AdMuS01ZXX— Pari (@BluntIndianGal) June 4, 2025
ఆర్‌సీబీ టైటిల్ అందుకోవడంలో కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించాడు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విజయపథంలో నడిపించాడు. అందుకే ఆ జట్టుకు పెద్ద దిక్కు యిన విరాట్ కోహ్లీ.. తన కలను నిజం చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఓ బహుమతిని ఇచ్చాడు.
Virat Kohli gifting his MRF bat to RCB Captain & Rajat kissing the bat. 😍 pic.twitter.com/GSM7iOUJWh
— Johns. (@CricCrazyJohns) June 4, 2025
స్వయంగా తన బ్యాట్‌నే కోహ్లీ.. రతజ్ కు అందించారు. ఇక కోహ్లీ ఇచ్చిన గిఫ్ట్‌కు రజత్ ఫిదా అయ్యాడు. కోహ్లీ బ్యాట్‌ను ముద్దాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.