Virat Kohli : రోహిత్ శ‌ర్మను ఉద్దేశించే కోహ్లీ ఆ వ్యాఖ్య‌లు చేశాడా? ఒక్క క‌ప్పు గెల‌వ‌గానే.. ‘దేవుడు నాకు ఆ బ‌లాన్ని..’

మ్యాచ్ అనంత‌రం విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Virat Kohli : రోహిత్ శ‌ర్మను ఉద్దేశించే కోహ్లీ ఆ వ్యాఖ్య‌లు చేశాడా? ఒక్క క‌ప్పు గెల‌వ‌గానే.. ‘దేవుడు నాకు ఆ బ‌లాన్ని..’

IS Virat Kohli indirectly attacks Rohit Sharma after RCB IPL 2025 triumph

Updated On : June 4, 2025 / 11:19 AM IST

ఇన్నాళ్లు అంద‌ని ద్రాక్ష‌గా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను విరాట్ కోహ్లీ ఎట్ట‌కేల‌కు అందుకున్నాడు. మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంబురాలు అంబరాన్ని అంటాయి.

ఇక మ్యాచ్ అనంత‌రం విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తాను ఐపీఎల్‌లో చివ‌రి రోజు వ‌ర‌కు ఆర్‌సీబీ త‌రుపున మాత్ర‌మే ఆడ‌తాన‌ని స్ప‌ష్టం చేశాడు. అదే స‌మ‌యంలో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా మాత్రం తాను ఆడ‌న‌ని అన్నాడు. 20 ఓవ‌ర్ల పాటు మైదానంలో ఉంటూ ఇంపాక్ట్ చూపించాల‌ని భావిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. దేవుడు త‌న‌కు ఆ దృక్పథాన్ని, ప్రతిభను ఇచ్చిన‌ట్లు తెలిపాడు. జ‌ట్టుకు స‌హాయం చేయ‌డానికి వివిధ మార్గాల‌ను క‌నుగొంటాను అని అన్నాడు.

Virat Kohli : 18వ నంబ‌ర్‌తో విరాట్ కోహ్లీకి విడ‌దీయ‌రాని అనుబంధం.. మ‌రీ ఇలానా!

కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం కొద్ది మంది సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా మాత్ర‌మే బ‌రిలోకి దిగుతున్నారు. 20 ఓవ‌ర్ల‌ పాటు మైదానంలో ఉండ‌డం లేదు. ఊదాహ‌ర‌ణ‌కు ముంబై ఇండియ‌న్స్ త‌రుపున రోహిత్ శ‌ర్మ ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా మాత్ర‌మే ఆడాడు. కేవ‌లం బ్యాటింగ్ మాత్ర‌మే చేశాడు. మైదానంలో ఎక్కువ‌గా క‌నిపించ‌లేదు.

RCB : బుడ్డోడా.. ఇక నువ్వు స్కూల్‌కి పోవాల్సిన టైమ్ వ‌చ్చింది.. ఆర్‌సీబీ క‌ప్పుకొట్టింది..

దీంతో కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు ఇన్‌డైరెక్ట్‌గా రోహిత్ శ‌ర్మ‌ను ఉద్దేశించ‌న‌వే అని కొంద‌రు అంటుండ‌గా.. రోహిత్, కోహ్లీ మంచి ఫ్రెండ్స్ అని, కోహ్లీ జ‌న‌ర‌ల్‌గా ఆ వ్యాఖ్య‌లు చేశాడ‌ని ఇంకొంద‌రు అంటున్నారు.