RCB : బుడ్డోడా.. ఇక నువ్వు స్కూల్‌కి పోవాల్సిన టైమ్ వచ్చింది.. ఆర్‌సీబీ కప్పుకొట్టింది..
ఓ జట్టు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది

RCB win IPL trophy Finally the little one will join school
ఓ జట్టు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతికూలతలన్నింటినీ అధిగమించి, అవమానాలను భరించి, అవహేళలను సహించి, ఆఖరికి మీమ్ మెటీరియల్‌గా మారినా కూడా పట్టు వద్దలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్‌లో గెలవగానే విరాట్ కోహ్లీతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆర్‌సీబీ అభిమానుల సంబురాలు అంబరాన్ని తాకాయి.
17 ఏళ్ల పాటు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ ట్రోఫీని.. ఆర్‌సీబీ 18వ సీజన్‌లో అందుకుంది. ఆర్‌సీబీ కప్పు కొట్టాలని కోరుకున్న ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఆర్‌సీబీ మ్యాచ్‌లు ఆడే సందర్భాల్లో కొందరు అభిమానులు ఫ్లకార్డులు పట్టుకుని తమ కోరికను తెలియజేసిన సందర్భాలను ఎన్నో చూశాం.
Rajat Patidar : ఆర్‌సీబీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.. రజత్ పాటిదార్ ఓల్డ్ కామెంట్స్ వైరల్..
Finally the little one will join school. 😄 pic.twitter.com/d0ChFw9l4j
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
ఇంకొందరు మాత్రం ఆర్‌సీబీ ఎప్పటికి టైటిల్ గెలవదని, కొంచెం వ్యంగ్యంగా చెబుతూ.. దాన్ని తమ జీవితాలతో ముడిపెడుతూ వచ్చారు. కొందరు ఆర్‌సీబీ గెలిచే వరకు పెళ్లి చేసుకోమని మైదానంలో ఫ్లకార్డలతో చెప్పిన సందర్భాలు చూశాం.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆర్‌సీబీ టైటిల్ గెలవడం కల.. ఇక మీకు పెళ్లి అయినట్లే అని కామెంట్లు చేసిన వాళ్లు ఎందరో.
ఇక ఇప్పుడు ఆర్‌సీబీ టైటిల్ గెలవడంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ఓ చిన్నారి ఓ ఫ్లకార్డును పట్టుకుని ఉన్నాడు. ఆర్‌సీబీ టైటిల్ గెలిచేంత వరకు స్కూల్‌లో జాయిన్ కాను అని రాసి ఉంది. ఇక ఇప్పుడు ఆర్‌సీబీ టైటిల్ గెలవడంతో.. బుడ్డోడా నువ్వు స్కూల్ పోవాల్సిన టైమ్ వచ్చింది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Ye moti bhi to pic.twitter.com/JjIOhgggly
— Professor Sahab (@ProfesorSahab) June 4, 2025
ఇక పై ఎవ్వరూ కూడా ‘ఆర్‌సీబీ టైటిల్ కొట్టేంత వరకు’ అనే అవకాశం ఇక లేదని అంటున్నారు.