Virat Kohli : 18వ నంబ‌ర్‌తో విరాట్ కోహ్లీకి విడ‌దీయ‌రాని అనుబంధం.. మ‌రీ ఇలానా!

స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి 18వ నంబ‌ర్‌తో ఏదో విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది.

Virat Kohli : 18వ నంబ‌ర్‌తో విరాట్ కోహ్లీకి విడ‌దీయ‌రాని అనుబంధం.. మ‌రీ ఇలానా!

Do you know number 18 how lucky to Virat Kohli

Updated On : June 4, 2025 / 10:46 AM IST

స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి 18వ నంబ‌ర్‌తో ఏదో విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అత‌డి కెరీర్‌లో 18వ నంబ‌ర్ మ్యాజిక్ కొన‌సాగుతూనే ఉంది.

అత‌డు ధ‌రించే జెర్సీ నంబ‌ర్ 18 అన్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌లో ఎన్నాళ్లుగానో ఊరిస్తూ ఉన్న టైటిల్‌ను 18వ సీజ‌న్‌లోనే అందుకోవ‌డం విశేషం. ఆర్‌సీబీ త‌రుపున 18 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు. అంతేనా క‌ప్పు అందుకున్న తేదీ (03-06-2025)లోని అంకెలు అన్ని క‌లిపినా చివ‌రికి వ‌చ్చేది 18. ఇంకా ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో కోహ్లీ 657 ప‌రుగులు సాధించాడు. వీటి అన్నింటినికి క‌లిపినా 18 వ‌స్తుంది. ఈ అద్భుతమైన సంయోగం కేవలం యాదృచ్చికం కాదని.. ఇది దేవుళ్ళ లిఖితమని ఫ్యాన్స్‌ గట్టిగా నమ్ముతున్నారు.

RCB : బుడ్డోడా.. ఇక నువ్వు స్కూల్‌కి పోవాల్సిన టైమ్ వ‌చ్చింది.. ఆర్‌సీబీ క‌ప్పుకొట్టింది..

ఇదిలా ఉంటే.. ఆర్‌సీబీ క‌ప్పు గెల‌వ‌డంతో ఆ జ‌ట్టు అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఇక ఫైన‌ల్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3 ఫోర్లు) రాణించ‌గా, మ‌యాంక్ అగ‌ర్వాల్ (24), ర‌జ‌త్ పాటిదార్ (26), లియామ్ లివింగ్ స్టోన్ (25), జితేశ్ శ‌ర్మ (24)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, జేమిస‌న్ లు చెరో మూడు వికెట్లు తీయ‌గా.. విజ‌య్ కుమార్ వైశాక్‌, చాహ‌ల్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Rajat Patidar : ఆర్‌సీబీ ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేదు.. ర‌జ‌త్ పాటిదార్ ఓల్డ్ కామెంట్స్ వైర‌ల్..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో శ‌శాంక్ సింగ్ (61 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), జోష్ ఇంగ్లిష్ (39; 23 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) రాణించినా మిగిలిన బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో పంజాబ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.