Krunal Pandya : చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఐపీఎల్‌లో కృనాల్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.

Courtesy BCCI
ఐపీఎల్‌లో కృనాల్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడంతో కృనాల్ ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (26), జితేష్ శర్మ (24), లివింగ్ స్టోన్ (25) లు రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(61 నాటౌట్) ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో కృనాల్ తన స్పిన్ మాయాజాలంతో పంజాబ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను బెంగళూరు వైపు తిప్పాడు.
2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మొత్తంగా రెండు సార్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కృనాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఐపీఎల్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుంది వీరే..
* 2008లో యూసఫ్ పఠాన్ (ఆర్ఆర్)
* 2009లో అనిల్ కుంబ్లే (ఆర్‌సీబీ)
*2010లో సురేశ్ రైనా (సీఎస్‌కే)
*2011లో మురళీ విజయ్ (సీఎస్‌కే)
*2012లో మన్విందర్ బిస్లా (కేకేఆర్)
*2013లో కీరన్ పొలార్డ్ (ముంబై)
RCB : బుడ్డోడా.. ఇక నువ్వు స్కూల్‌కి పోవాల్సిన టైమ్ వచ్చింది.. ఆర్‌సీబీ కప్పుకొట్టింది..
*2014లో మనీష్ పాండే (కేకేఆర్)
*2015లో రోహహిత్ శర్మ (ముంబై)
*2016లో బెన్ కటింగ్ (ఎస్ఆర్‌హెచ్)
*2017లో కృనాల్ పాండ్యా (ముంబై)
*2018లో షేన్ వాట్సన్ (సీఎస్‌కే)
*2019లో జస్‌ప్రీత్ బుమ్రా (ముంబై)
*2020లో ట్రెంట్ బౌల్ట్ (ముంబై)
*2021లో ఫాఫ్ డుప్లెసిస్ (సీఎస్‌కే)
*2022లో హార్దిక్ పాండ్యా (గుజరాత్)
*2023లో డెవాన్ కాన్వే (సీఎస్‌కే)
*2024లో మిచెల్ స్టార్క్ (కేకేఆర్)
*2025లో కృనాల్ పాండ్యా (ఆర్‌సీబీ)