IPL 2020: ముంబై ఇండియన్స్ హెచ్చరిక “Kung Fu Pandya At Work
- Subhan Ali Shaik
- Published On : August 20, 2020 / 03:14 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 30రోజుల్లో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ సీజన్ కు సర్వత్రా ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బహుకాలంగా దూరంగా ఉంటున్న ముంబై పాండ్యా హార్దిక్ పాండ్యా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈ మేరకు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ముంబై ఇండియన్స్ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేసింది.
పర్ఫెక్ట్లీ టోన్డ్ మజిల్స్ తో సిద్ధమయ్యాడని పోస్టు పెట్టింది. ”హెచ్చరిక: కుంగ్ ఫూ పాండ్యా పనిలో ఉన్నాడు. #OneFamily #IPL2020 అనే హ్యాష్ ట్యాగులతో కామెంట్ పెట్టింది. ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్రాంచైజీలన్నింటిలో ముంబై ఇండియన్స్ కు ఎక్కువ ఆతురతగా ఎదురుచూస్తుంది. హార్దిక్ ఫొటోకు వచ్చిన కామెంట్ల నుంచే తెలుస్తుంది.
సెప్టెంబర్ 2019 తర్వాత వెన్నుగాయంతో బాధపడిన పాండ్యా లండన్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ఐపీఎల్ నుంచి బెనిఫిట్ పొందిన క్రికెటర్లలో హార్దిక్ ఒకడు. ఇక ఫ్రాంచైజీ విషయానికొస్తే ఐపీఎల్ 4వ టైటిల్ ను కూడా సొంతం చేసుకోగలిగింది. గతేడాది జరిగిన సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్ లో ఓడించింది.
