Sanju Samson : సంజూ శాంసన్‌కు ఘోర అవమానం! కూరలో కరివేపాకులా తీసేశారా?
టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) ఘోర అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుతోంది
Sanju Samson and Sreesanth Handshake Mystery Takes Internet By Storm
Sanju Samson : టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) ఘోర అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుతోంది. కేరళ క్రికెట్ లీగ్ 2026 ఫైనల్ బహుమతి ప్రధానోత్సవానికి సంబంధించిన వీడియోగా తెలుస్తోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత ప్రజంటేషన్ వేడుకలో భాగంగా టీమ్ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ వేదికపైకి వెళ్లాడు. అక్కడ ఉన్న అందరితోనూ అతడు కరచాలనం చేశాడు ఒక్క సంజూ శాంసన్‌తో తప్ప.
వీడియోలో ఏం ఉందంటే?
ప్రజంటేషన్ వేడక సందర్భంగా అధికారులతో పాటు సంజూ శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిలబడి ఉన్నాడు. అప్పుడు శ్రీశాంత్ వేదికపైకి వచ్చాడు. సంజూ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. శాంసన్ పక్కన నిలబడి ఉన్న ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సంజూను కనీసం పట్టించుకోలేదు.
ఈ వీడియో వైరల్ అవుతుండగా ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తాయని, సంజూను కూరలో కరివేపాకును తీసివేసినట్లుగా తీసివేశాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అటు సంజూ శాంసన్ గానీ, ఇటు శ్రీశాంత్ గానీ స్పందించలేదు.
Sreesanth and sanju Samson ignored the hand snakes between each other in kcl final ?….
Any Rift??#KCL #SANJU pic.twitter.com/UbteQpw6nl
— 𝗬𝗘𝗟𝗟𝗢𝗩𝗘 𝗙𝗢𝗫𝗬 (@yelloveX7) September 6, 2026
ఇదిలా ఉంటే.. కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్‌ను త్రిసూర్ టైటాన్స్ కైవసం చేసుకుంది. శనివారం రాత్రి కాలికట్ గ్లోబల్ స్టార్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో త్రిసూర్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సంజూ శాంసన్ ప్రస్తుతం భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఓ వైపు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతుండగా, మరో వైపు కుర్రాళ్ల నుంచి సంజూ శాంసన్‌కు గట్టి పోటీ ఉంది. ఈ క్రమంలో అఫ్గాన్ సిరీస్‌లో సంజూ శాంసన్ ఎలా ఆడతాడు అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది.
