Ind Vs Pak : పాక్పై అద్భుత విజయం తరువాత భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..
Ind Vs Pak Harmanpreet : మహిళల ఆసియా కప్లో భాగంగా శనివారం రాత్రి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు.
Harmanpreet
Ind Vs Pak Harmanpreet : మహిళల ఆసియా కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో విజయంతో భారత్ హ్యాట్రిక్ సాధించింది. శనివారం గ్రూప్-ఎలో తన చివరి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై ఏకపక్ష పోరులో 7 వికెట్ల తేడాతో భారీ ఘన విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు శ్రీ చరణి, దీప్తి, ప్రేమ విజృంభించడంతో పాక్ బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. దీంతో ఆ జట్టులో షహల్ చేసిన 14 పరుగులే అత్యధిక స్కోర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన శ్రీ చరణికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఈ విజయం మాకు ఎంతో కీలకం. జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మేమెప్పుడూ మైదానంలో ఆధిపత్యం ప్రదర్శించడానికే ప్రాధాన్యం ఇస్తాం. బౌలర్లు ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేశాు. టోర్నీలో ఇంకో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదే ఊపును చివరి వరకు కొనసాగిస్తామని హర్మన్ ప్రీత్ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. టీ20ల్లో హర్మన్ ప్రీత్ అరుదైన ఘనత సాధించింది. హర్మన్ ప్రీత్ ఇప్పటి వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన మ్యాచ్లు 150. మహిళల్లోనే కాదు, పురుషుల క్రికెట్లోనూ ఏ ప్లేయర్ ఇన్ని అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్గా వ్యవహరించలేదు. అయితే, 87 మ్యాచ్లలో జట్టును గెలిపించిన హర్మన్ ప్రీత్.. 57 మ్యాచ్లలో ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా.. ఐదు మ్యాచ్లలో ఫలితం తేలలేదు.
