Stunning Catch : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి క్యాచ్‌ను ఎప్పుడూ చూసి ఉండ‌రు.. దీన్ని ఏమ‌ని పిలవాలో కాస్త చెప్ప‌రూ..?

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు ఫీల్డ‌ర్లు త‌మ విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంటుంటారు.

Kursad Dalyan Bizarre Catch Stuns Fans in ECS Bulgaria T10 match

Stunning Catch video : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు ఫీల్డ‌ర్లు త‌మ విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంటుంటారు. కొన్ని సార్లు వారి ఫీల్డింగ్ చూస్తే మ‌న క‌ళ్ల‌ని మ‌న‌మే న‌మ్మ‌లేని విధంగా ఉంటాయి. ఈసీఎస్ బల్గేరియా టీ20 టోర్నీలో ఓ ఫీల్డ‌ర్ ప‌ట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ క్యాచ్‌ను చూసిన వారు ఇలా కూడా క్యాచ్ ప‌డ‌తారా..? క్యాచ్ ఆఫ్ ఇయ‌ర్ కాదు..కాదు.. క్యాచ్ ఆఫ్ ద సెంచ‌రీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీటీయూ-ఎంయూ ప్లెవెన్‌, అఫ్యోంకరహిసర్ ఎస్‌హెచ్‌ఎస్ జట్ల మ‌ధ్య శ‌నివారం (ఆగస్టు 3) మ్యాచ్ జ‌రిగింది. ప్లెవెన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. ష‌కీల్ ఫ‌రూకీ ఈ ఓవ‌ర్‌ని వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని ఆనందు కృష్ణ షాట్ ఆడాడు. అయితే.. స‌రిగ్గా క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో బంతి గాల్లోకి లేచింది. అఫ్యోంకరహిసర్ ఫీల్డర్ కుర్సాద్ దల్యాన్ బంతిని అందుకునేందుకు ముందుకు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాడు.

Paris Olympics : నీర‌జ్‌చోప్రా బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే..? మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?

అయితే.. బంతి నేల‌ను తాకే స‌మ‌యంలో త‌న కాలుని ముందుకు పెట్టాడు. బంతి అత‌డి షూ పై ప‌డి బౌన్స్ అయి గాల్లోకి లేచింది. వెంట‌నే ద‌ల్యాన్ సుల‌భంగా క్యాచ్‌ను అందుకున్నారు. అక్క‌డ ఉన్న వారు దాన్ని న‌మ్మ‌లేక‌పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన‌ అఫ్యోంకరహిసర్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ప్లెవెన్ నిర్ణీత 10 ఓవర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 40 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. దీంతో అఫ్యోంకరహిసర్ 64 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

IND vs SL : వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను బెదిరించిన‌ రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు