Paris Olympics : నీరజ్‌చోప్రా బరిలోకి దిగేది ఎప్పుడంటే..? మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?
దేశంలోని 1.4 బిలియన్ల ప్రజల ఆశలు ఒలింపిక్ ఛాంపియన్, జావెలిన్ త్రో నీరజ్ చోప్రా పైనే ఉన్నాయి.
Paris Olympics – Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన ఓ మోస్తరుగానే ఉంది. ఇప్పటి వరకు కేవలం మూడు కాంస్య పతకాలను మాత్రమే సొంతం చేసుకుంది. పతకాల పట్టికలో 54వ స్థానంలో నిలిచింది. దేశంలోని 1.4 బిలియన్ల ప్రజల ఆశలు ఒలింపిక్ ఛాంపియన్, జావెలిన్ త్రో నీరజ్ చోప్రా పైనే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారం పతకం సాధించిన చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లోనూ అలాంటి ప్రదర్శననే పునరావృతం చేయాలని కోరుకుంటున్నారు.
మరీ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బరిలోకి ఏ రోజున దిగుతాడో అన్న విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది నెట్టింట తెగ వెతికేస్తున్నారు. మరీ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
IND vs SL : వాషింగ్టన్ సుందర్‌ను బెదిరించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఆగస్టు 6న జరగనున్న ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో పాల్గొననున్నాడు. గ్రూపు ఏ క్వాలిఫికేషన్ రౌండ్ మధ్యాహ్నం 1.50 గంటలకు ప్రారంభం కానుంది. ఆ తరువాత గ్రూప్ బి క్వాలిఫికేషన్ రౌండ్ 3.20 గంటలకు ఆరంభం కానుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో సత్తా చాటితే నీరజ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాడు. ఆగస్టు 8న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.55 గంటలకు ఫైనల్ ఆరంభం కానుంది.
ఎక్కడ చూడొచ్చంటే..?
మనదేశంలో పారిస్ ఒలింపిక్స్ 2024 ని స్పోర్ట్స్18 నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. Sports18 1, Sports18 1 HD ఛానల్స్ ఆంగ్లంలో ప్రసారాలు చేస్తున్నాయి. తమిళం, తెలుగు ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ 18 ఖేల్, స్పోర్ట్స్ 18 2 హిందీలో గేమ్‌లను వీక్షించొచ్చు. ఈ అన్ని ఛానెల్‌లలో నీరజ్ చోప్రాను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌లో జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా చూడొచ్చు.