KXIP మ్యాచ్ గెలిచారంటే సంబరాలే..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. 2018 సీజన్‌లో ఫైనల్ వరకూ వెళ్తుందని ఆశించినా ప్లే ఆఫ్‌లోనే వెనుదిరిగింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. 2018 సీజన్‌లో ఫైనల్ వరకూ వెళ్తుందని ఆశించినా ప్లే ఆఫ్‌లోనే వెనుదిరిగింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. 2018 సీజన్‌లో ఫైనల్ వరకూ వెళ్తుందని ఆశించినా ప్లే ఆఫ్‌లోనే వెనుదిరిగింది. 2019 సీజన్‌లో కూడా అదే దూకుడు చూపిస్తూ.. ఆడిన 6 మ్యాచ్‌లలో నాలుగింటిలో విజయం దక్కించుకుంది. మాన్కడింగ్.. ఎక్స్ ట్రా బాల్స్‌ వివాదాలతో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ గెలిచిందంటే రచ్చ.. రచ్చే. 
Read Also : SRH విలియమ్‌సన్.. ఖలీల్ అహ్మద్‌లు ఢిల్లీ మ్యాచ్‌తో రంగంలోకి

జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింతా.. గేమ్ పూర్తి అయిన వెంటనే సంబరాలు చేసుకోవడం మొదలుపెడుతుంది. ప్రతి ప్లేయర్‌తో సెల్ఫీలు దిగుతూ.. కుదిరితే స్టేడియానికి వచ్చిన పంజాబ్ జట్టు అభిమానుల సెల్ఫీలకు కూడా ఫోజులిస్తుంది. ఈవిడ మాట అటుంచింతే.. సంబరాల సోగ్గాడు.. విధ్వంసకర బ్యాట్స్‌మన్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అయితే చిందులేస్తూనే కాలం గడిపేస్తాడు. 

ప్రతి సందర్భంలోనూ మంగళవాయిద్యాలతో సెలబ్రేషన్ జరుపుకునే కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ప్రతి విజయాన్ని ఫుల్ సెలబ్రేటివ్ మోడ్‌లో ముగిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన పంజాబ్ వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్‌లో విజయం దక్కిచుకున్న ప్రత్యేక ఆనందంలో మునిగితేలింది పంజాబ్. 
Read Also : మలింగ మళ్లీ వచ్చాడు.. ప్రతీకారం తీర్చుకోవలసిందే..