టాస్ ఓడినా పంజాబ్ బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ లో సత్తా చాటారు. పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచి దూకుడు చూపించిన పంజాబ్ ఆటగాళ్లు.. రాజస్థాన్ కు 183 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (52), క్రిస్ గేల్(30)పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్(26), డేవిడ్ మిల్లర్(40) తో సరిపెట్టుకున్నారు.
ఆఖరి 2 ఓవర్లలో తడబడిన పంజాబ్ 3 వికెట్లు కోల్పోయింది. నికోలస్ పూరన్(5), మన్దీప్ సింగ్(0), రవిచంద్రన్ అశ్విన్(17), ముజీబ్ ఉర్ రెహ్మాన్(0)పరుగులతో ముగించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే 3వికెట్లు తీయగా, ధావల్ కుల్కర్ణి, జయదేవ్, ఇష్ సౌదీ తలో వికెట్ పడగొట్టారు.