Litton MS Das : భయ్యా నీలో ధోనీ పూనాడా ఏంటి..! శ్రీలంక బ్యాట‌ర్‌ను ధోనీ తరహాలో రనౌట్ చేసిన బంగ్లా కీపర్.. వీడియో వైరల్

లిట్టన్ దాస్ చేసిన రనౌట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయ్యా..

MS Das

No Look Run Out : వికెట్ల వెనక వేగంగా కదులుతూ ఏ చిన్న అవకాశం దొరికినా బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించడంలో టీమిండియా మాజీ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎవరూ సాటిరారనే చెప్పొచ్చు. వికెట్ల వెనుక ధోనీ ఉన్నాడంటే ఎంత స్థాయి బ్యాటర్ అయినా ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడుతుంటారు. తొందరపడి రన్ తీసేందుకు కూడా సాహసించరు. బ్యాట్స్ మెన్ రన్ తీసే క్రమంలో ఫీల్డర్ నుంచి బంతి ధోనీ చేతికి అందితేచాలు.. చూడకుండానే త్రోలు వేస్తూ ఊహించని రీతిలో బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ బాట పట్టించడంలో ధోనీ దిట్ట. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తరువాత అతని తరహాలో బ్యాటర్లను ఔట్ చేసిన కీపర్లు తక్కువనే చెప్పొచ్చు. తాజాగా బంగ్లాదేశ్ కీపర్ లిట్టన్ ఎంఎస్ దాస్ తన అద్భుత ప్రతిభతో మహేంద్ర సింగ్ ధోనీని గుర్తుకుతెచ్చాడు.

Also Read : India vs England : బెస్ట్ ఫీల్డింగ్ అవార్డు అందుకున్న టీమిండియా ఆటగాళ్లు.. వాళ్లెవరో ఈ వీడియోలో చూడండి

శ్రీలంక -బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరి బంతికి క్రీజులోదసున్ శనక ఉన్నాడు. ముస్తాఫీజుర్ రెహమాన్ వేసిన బంతిని మిడ్ఆన్ లోకి కొట్టాడు. ఒక పరుగు తీశారు. శనక రెండో పరుగు పూర్తి చేసేందుకు పరుగెత్తాడు.. బంగ్లా పీల్డర్ రిషద్ హోస్సెన్ బంతిని అందుకొని కీపర్ లిట్టన్ వైపు విసిరాడు.. దీంతో ఆ బంతి వికెట్లకు కొంచెం దూరంగా వెళ్తున్న క్రమంలో చేతి గ్లౌజును తీసేసిన లిట్టన్ దాస్.. బంతిని అందుకొని చూడకుండానే వెనుక నుంచి వికెట్లకు త్రో వేశాడు. శనక బ్యాట్ ను క్రీజులో పెట్టే సమయంలో ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. లిట్టన్ దాస్ అద్భుతమైన రీతిలో నో లుక్ రనౌట్ చేయడంతో మైదానంలోని ప్రేక్షకులతోపాటు టీవీల్లో చూస్తున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ సమయంలో అందరికి ధోనీ గుర్తుకొచ్చాడు.

Also Read : యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఇన్నింగ్స్.. కాంగ్రెస్ కంచుకోటలో పోటీ

ప్రస్తుతం లిట్టన్ దాస్ చేసిన రనౌట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయ్యా.. ధోనీని గుర్తుచేశావ్ అంటూ.. లిట్టన్ దాస్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 28 పరుగుల తేడాతో శ్రీలంకపై ఓటమి పాలైంది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు