Abu Dhabi T10 League : అబుదాబీ టీ10 లీగ్‌లో దుమ్ములేపిన ఆర్‌సీబీ ఆట‌గాడు.. 15 బంతుల్లోనే 50 ర‌న్స్‌.. ఆనందంలో బెంగ‌ళూరు ఫ్యాన్స్‌..

ఐపీఎల్ మెగా వేలంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

Livingstone hits match winning fifty in Abu Dhabi T10 League

ఐపీఎల్ మెగా వేలంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. రానున్న సీజ‌న్‌లో ఎలాగైన క‌ప్పును సొంతం చేసుకోవాల‌ని కోరిక‌తో జాగ్ర‌త్త‌గా ఆట‌గాళ్ల‌ను తీసుకుంది. రూ.8.75 కోట్లు వెచ్చించి ఇంగ్లాండ్ ఆట‌గాడు లియాన్ లివింగ్ స్టోన్ ను తీసుకుంది. తాజాగా ఈ ఆట‌గాడు అబుదాబి టీ10 లీగ్‌లో దుమ్ములేపాడు. బంగ్లా టైగ‌ర్స్‌ త‌రుపున ఆడుతున్న ఇత‌డు 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాది 50 ప‌రుగుల‌తో జ‌ట్టును గెలిపించింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 126 ప‌రుగులు చేసింది. నిఖిల్ చౌద‌రి (16 బంతుల్లో 47 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌. బెంగాల్ బౌల‌ర్ల‌లో డేవిడ్ పైనే, జోస్ లిటిల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్‌ ఖాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం లివింగ్ స్టోన్ విధ్వంసంతో ల‌క్ష్యాన్ని బంగ్లా టైగ‌ర్స్ 9.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.

Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ చివరి ‘వీడ్కోలు’ సందేశం.. ‘ఈ తొమ్మిదేళ్ల ప్ర‌యాణం..’

లివింగ్‌స్టోన్‌తో పాటు దసున్‌ షనక (14 బంతుల్లో 33), హజ్రతుల్లా జజాయ్‌ (20 బంతుల్లో 24) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షాహిద్‌ ఇక్బాల్‌, షాదాబ్‌ ఖాన్ త‌లా ఓ వికెట్ సాధించారు.

కాగా.. అబుదాబీ టీ10 లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇదే మొద‌టి విజ‌యం. పాయింట్ల పట్టికలో బంగ్లా టైగ‌ర్స్ ఏడో స్థానంలో ఉంది.

IPL Mega Auction 2025 : ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోని బ్యాట‌ర్లు, బౌల‌ర్లు, ఆల్‌రౌండ‌ర్లు వీరే.. డేవిడ్ వార్న‌ర్ నుంచి పృథ్వీ షా వ‌ర‌కు..