Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ చివరి ‘వీడ్కోలు’ సందేశం.. ‘ఈ తొమ్మిదేళ్ల ప్రయాణం..’
వేలం ముగిసిన తరువాత పంత్ డీసీకి వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Rishabh Pant sends final goodbye message to Delhi Capitals
ఐపీఎల్ మెగా వేలం 2025 ముగిసింది. అన్ని ప్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేశాయి. ఇక టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డులకు ఎక్కాడు. మెగా వేలం కంటే ముందు దాదాపు తొమ్మిది సీజన్ల పాటు పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వేలం ముగిసిన తరువాత పంత్ డీసీకి వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో తన ప్రయాణానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదన్నాడు.
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ వయస్సు పై ఆరోపణలు.. 13 ఏళ్లు కాదు 15.. స్పందించిన తండ్రి..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ప్రయాణం అద్భుతం కంటే తక్కువ ఏమీ కాదన్నాడు. మైదానంలో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలను చూశానన్నాడు. యుక్త వయసులోనే జట్టులో భాగం అయ్యానని, అప్పటి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఊహించని విధంగా తాను ఎదిగానని తెలిపాడు. తొమ్మిదేళ్ల పాటు జట్టులో కలిసి ప్రయాణించానని పేర్కొన్నాడు.
ఇంతకాలం ప్రయాణం చేయడం అనేది అంత సులభం కాదన్నాడు. తన ప్రయాణాన్ని విలువైందిగా మార్చింది అభిమానులేనని చెప్పాడు. ‘నా జీవితంలో అత్యంత కష్టతరమైన దశలో ఫ్యాన్స్ అండగా ఉన్నారు. మీ ప్రేమను, అభిమానాన్ని ఎప్పటికి మరచిపోను. నా హృదయంలో ఎల్లప్పుడూ దాన్ని దాచుకుంటాను. నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మిమ్మల్ని అలరించేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇన్నాళ్ల పాటు నా కుటుంబంగా ఉండి, నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు.’ అంటూ పంత్ తెలిపారు.
IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు షాక్.. స్వదేశానికి వస్తున్న గౌతమ్ గంభీర్!
.@DelhiCapitals 🙌#RP17 pic.twitter.com/DtMuJKrdIQ
— Rishabh Pant (@RishabhPant17) November 26, 2024