IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు షాక్.. స్వదేశానికి వస్తున్న గౌతమ్ గంభీర్!
టీమ్ఇండియా హెడ్ కోచ్ స్వదేశానికి వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Team India Head Coach Gautam Gambhir To Return Home After Perth Test Win Report
ఆసీస్ గడ్డ పై భారత్ అదరగొట్టింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచులో ఘన విజయాన్ని సాధించింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అయితే.. గెలుపు జోష్ లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. టీమ్ఇండియా హెడ్ కోచ్ స్వదేశానికి వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్పష్టమైన కారణం తెలియనప్పటికి అతడు వ్యక్తిగత కారణాలతోనే భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. అతడు మళ్లీ ఎప్పుడు ఆస్ట్రేలియా వెలుతాడు అనే ఖచ్చితమైన సమాచారం లేనప్పటికి రెండో టెస్టు ప్రారంభం నాటికి జట్టుతో కలుస్తాడని పేర్కొంది. ‘వ్యక్తిగత కారణాలతో గంభీర్ స్వదేశానికి వెలుతున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా ఇందుకు బోర్డు అంగీకరించింది. రెండో టెస్టు ప్రారంభం నాటిని అతడు జట్టుతో చేరతాడు.’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు తెలియజేసింది.
IPL Mega Auction 2025 : ముగిసిన వేలం.. ఏ జట్టులో ఎవరు ఉన్నారు.. అప్‌డేటెడ్ ఫుల్ లిస్ట్ ఇదే..
ఇదిలా ఉంటే.. అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ డే అండ్ నైట్ టెస్ట్ (పింక్ బాల్ టెస్టు) ఆడేందుకు బుధవారం భారత జట్టు కాన్‌బెర్రాకు వెళ్లనుంది. అక్కడ రెండో టెస్టుకు ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. పింక్ బాల్ టెస్టుకు ముందు భారత్ శనివారం నుంచి రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
కాగా.. రెండో సంతానం జన్మించడంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం అయ్యాడు. ఆదివారం ఆసీస్ చేరుకున్న రోహిత్ శర్మ సోమవారం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. పింక్‌బాల్ టెస్టు కోసం గులాబి బంతితో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్స్‌లో అతడికి నవదీప్ సైని, యశ్ దయాల్, ముకేశ్ కుమార్ లు బౌలింగ్ చేశారు.
Vaibhav Suryavanshi : ఐపీఎల్ వేలం.. 13 ఏళ్ల కుర్రాడి పై కోట్ల వర్షం.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ?