IPL Mega Auction 2025 : ముగిసిన వేలం.. ఏ జట్టులో ఎవరు ఉన్నారు.. అప్‌డేటెడ్ ఫుల్ లిస్ట్ ఇదే..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం 2025 ముగిసింది.

Full updated squads of all teams after Mega Auction
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం 2025 ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో 182 మంది ఆటగాళ్లను అన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఎనిమిది మందిని జట్లు ఆర్టీఎమ్(రైట్ టు మ్యాచ్) ద్వారా సొంతం చేసుకుననాయి. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.639.15 కోట్లు ప్లేయర్ల కోసం ఖర్చు చేశాయి. ఇక ఏ జట్టులో ఎవరు ఉన్నారు. ఫ్రాంచైజీలు వారిపై ఎంత ఖర్చు పెట్టాయి అన్నది చూద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు: ఇషాన్ కిషన్ (11.25 కోట్లు), మహ్మద్ షమి (10 కోట్లు), హర్షల్ పటేల్ (8 కోట్లు), అభినవ్ మనోహర్ (3.20 కోట్లు), రాహుల్ చాహర్ (3.20 కోట్లు), ఆడమ్ జంపా (2.40 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (1.50 కోట్లు), ఎషన్ మలింగ (1.20 కోట్లు), బ్రైడన్ కార్సే (కోటి), జయ్‌దేవ్ ఉనద్కత్ (కోటి), కమిందు మెండిస్ (75 లక్షలు), జిషాన్ అన్సారీ (40 లక్షలు), సచిన్ బేబి(30లక్షలు), అంకిత్ వర్మ (30 లక్షలు), అథర్వ తైడే (30 లక్షలు).
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: క్లాసెన్(23కోట్లు), కమిన్స్(18కోట్లు), అభిషేక్ (14కోట్లు), హెడ్(14కోట్లు), నితీశ్ కుమార్(6కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : హేజిల్‌వుడ్ (12 కోట్లు), ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు), జితేశ్ శర్మ (11 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (10.75 కోట్లు), లివింగ్‌స్టన్ (8.75 కోట్లు), రసిక్ దర్ (6 కోట్లు), కృనాల్ పాండ్య (5.75 కోట్లు), టిమ్ డేవిడ్ (3 కోట్లు), జాకబ్ బెథెల్ (2.60 కోట్లు), సుయాష్ శర్మ (2.60 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్(2కోట్లు), నువాన్ తుషార (1.60 కోట్లు), రొమారియో షెఫర్డ్ (1.50 కోట్లు), ఎంగిడి(కోటి), స్వప్నిల్ సింగ్ (50 లక్షలు), మోహిత్ రాధే(30లక్షలు), అభినందన్ సింగ్(30లక్షలు), స్వస్తిక్ చికారా(30లక్షలు), మనోజ్ భాండాగే ( 30 లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : విరాట్ కోహ్లీ (21 కోట్లు), యశ్ దయాల్ (5 కోట్లు), రజత్ పటిదార్ (11 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : కేఎల్ రాహుల్ (14 కోట్లు), మిచెల్ స్టార్క్(11.75కోట్లు), టి. నటరాజన్(10.75కోట్లు), జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్(9కోట్లు), ముకేశ్ కుమార్( 8కోట్లు), హ్యారీ బ్రూక్(6.25కోట్లు), అశుతోష్ శర్మ(3.80కోట్లు), మోహిత్ శర్మ(2.20 కోట్లు), ఫాఫ్ డుప్లెసిస్(2 కోట్లు), సమీర్ రజ్వీ(95లక్షలు), డోనోవన్ ఫెరెరా(75లక్షలు), దుశ్మంత చమీరా(75లక్షలు), విప్రజ్ నిగమ్(50లక్షలు), కరుణ్ నాయర్(50లక్షలు), మాధవ్ తివారి(40లక్షలు), త్రిపురాన విజయ్(30లక్షలు), మన్వంత్ కుమార్(30లక్షలు), అజయ్ మండల్(30లక్షలు), దర్శన్ నల్కండే(30లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : అక్షర్ పటేల్(16.50కోట్లు), కుల్‌దీప్ (13.25కోట్లు), స్టబ్స్(10కోట్లు), అభిషేక్ (4కోట్లు)
ముంబయి ఇండియన్స్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : ట్రెంట్ బోల్ట్ (12.50కోట్లు), దీపక్ చాహర్(9.25కోట్లు), విల్ జాక్స్(5.25కోట్లు), నమన్ ధిర్(5.25కోట్లు), అల్లా ఘజన్ఫర్(4.80కోట్లు), మిచెల్ శాంట్నర్(2కోట్లు), ర్యాన్ రికెల్టన్(కోటి), లిజాడ్ విలియమ్స్(75లక్షలు), రెకీ టాప్లే(75లక్షలు), రాబిన్ మింజ్(65లక్షలు), కర్ణ్ శర్మ(50లక్షలు), విఘ్నేశ్ పుతుర్(30లక్షలు), అర్జున్ టెండూల్కర్(30లక్షలు), బెవాన్ జాన్ జాకబ్స్(30లక్షలు), వెంకట సత్యనారాయణ పెన్మెట్స( 30లక్షలు), రాజ్ అంగధ్ బవ(30లక్షలు), శ్రీజిత్ కృష్ణన్(30లక్షలు), అశ్వని కుమార్(30లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: జస్‌ప్రీత్ బుమ్రా (18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (16.35 కోట్లు), హార్దిక్ పాండ్య (16.35 కోట్లు), రోహిత్ శర్మ (16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్ ..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : నూర్ అహ్మద్ (10 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు), డేవాన్ కాన్వే (6.25 కోట్లు), ఖలీల్ అహ్మద్ (4.80 కోట్లు), రచిన్ రవీంద్ర (4 కోట్లు), అన్షుల్ కాంబోజ్ (3.40 కోట్లు), రాహుల్ త్రిపాఠి (3.40 కోట్లు), సామ్ కరన్ (2.40 కోట్లు), గుర్జప్నీత్ సింగ్ (2.20 కోట్లు), నాథన్ ఎలిస్ (2 కోట్లు), దీపక్ హుడా (1.70 కోట్లు), జెమీ ఓవర్టన్ (1.50కోట్లు), విజయ్ శంకర్ (1.20 కోట్లు), వంశ్ బేడీ (55లక్షలు), ఆండ్రీ సిద్ధార్థ్(30లక్షలు), శ్రేయస్ గోపాల్(30లక్షలు), రామకృష్ణ ఘోష్(30లక్షలు), ముకేశ్ చౌదరి (30 లక్షలు), షేక్ రషీద్ (30 లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్ (18 కోట్లు), రవీంద్ర జడేజా (18 కోట్లు), మతిశా పతిరన (13 కోట్లు), శివమ్ దూబె (12 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ (4 కోట్లు)
కోల్‌కతా నైట్‌రైడర్స్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు), అన్రిచ్ నోకియా (రూ.6.50 కోట్లు), క్వింటన్ డికాక్ (రూ.3.60 కోట్లు), రఘువంశీ (రూ.3 కోట్లు), స్పెన్సర్ జాన్సన్ (రూ.2.80 కోట్లు), మొయిన్ అలీ(రూ.2కోట్లు), రెహ్మనుల్లా గుర్బాజ్ (రూ.2 కోట్లు), వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు), అజింక్య రహానె(రూ.1.50కోట్లు), రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(రూ.75లక్షలు), మనీశ్ పాండే (రూ.75 లక్షలు), అనుకుల్ రాయ్(రూ.40లక్షలు), లవ్‌నిత్ సిసోడియా(రూ.30లక్షలు), మయాంక్ మార్కండె (రూ.30 లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రింకు సింగ్ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), హర్షిత్ రాణా (రూ.4 కోట్లు), రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు), వానిందు హసరంగ (రూ.5.25 కోట్లు), మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు), నితీష్ రాణా (రూ.4.20 కోట్లు), ఫజల్ హక్ ఫారూఖీ (రూ.2 కోట్లు), క్వెనా మాఫకా(రూ.1.50కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు), వైభవ్ సూర్యవంశీ (రూ.1.10 కోట్లు), శుభమ్ దూబె (రూ.80 లక్షలు), యుధ్విర్ చరక్ (రూ.35 లక్షలు), అశోక్ శర్మ(రూ.30లక్షలు), కూనల్ రాథోడ్(రూ.30లక్షలు), కుమార్ కార్తీకేయ (రూ.30 లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: సంజు శాంసన్ (రూ.18 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు), హెట్‌మయర్ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : రిషభ్ పంత్ (రూ.27 కోట్లు), అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ.8 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ.7.50 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు), మిచెల్ మార్ష్ (3.40 కోట్లు), షాబాజ్ అహ్మద్ (రూ.2.40 కోట్లు), ఐడెన్ మార్‌క్రమ్ (రూ.2 కోట్లు), మ్యాధ్యూ బ్రీట్జ్(రూ.75లక్షలు), షామార్ జోసెఫ్ (రూ.75 లక్షలు), యం. సిద్ధార్థ్ (రూ.75 లక్షలు), అర్షిన్ కులకర్ణి(రూ.30లక్షలు), రాజ్‌వర్ధన్(రూ.30లక్షలు), యువరాజ్ చౌదరి (రూ. 30 లక్షలు), ప్రిన్స్ యాదవ్ (రూ.30 లక్షలు), ఆకాశ్ సింగ్ (రూ.30 లక్షలు), దిగ్వేష్ సింగ్ (రూ.30 లక్షలు), హిమ్మత్ సింగ్ (రూ.30 లక్షలు), ఆర్యన్ జుయల్ (రూ.30 లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)
పంజాబ్ కింగ్స్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ. 18 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ. 18 కోట్లు), మార్కస్ స్టాయినిస్ (రూ. 11 కోట్లు), మార్కో యాన్సెన్ (రూ. 7 కోట్లు), నేహల్ వధేరా (రూ. 4.2 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.4.2 కోట్లు), ప్రియాంశ్ ఆర్య (రూ.3.8 కోట్లు), జోష్ ఇంగ్లిష్ (రూ.2.6 కోట్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ. 2.4 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు), వైశాఖ్ విజయ్ కుమార్ (రూ.1.8 కోట్లు), యశ్ ఠాకూర్ (రూ.1.6 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్ (రూ. 1.5కోట్లు), ఆరోన్ హార్డీ (రూ.1.25 కోట్లు), విష్ణు వినోద్ (రూ.95 లక్షలు), జేవియర్ బార్ట్‌లెట్ (రూ. 80 లక్షలు), కుల్‌దీప్ సేన్ (రూ.80 లక్షలు), ప్రవీణ్‌దూబె(రూ.30లక్షలు), పైలా అవినాష్ (రూ.30 లక్షలు), సుర్యాంశ్ షెడ్గే (రూ. 30 లక్షలు), ముషీర్ ఖాన్ (రూ. 30 లక్షలు), హర్నూర్ పన్ను (రూ. 30 లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: శశాంక్ సింగ్ (రూ.5.50 కోట్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (రూ.4 కోట్లు)
గుజరాత్ టైటాన్స్..
కొనుగోలు చేసిన ప్లేయర్లు : జోస్ బట్లర్(రూ. 15.75కోట్లు), మొహమ్మద్ సిరాజ్(రూ.12.25కోట్లు), కగిసో రబాడ(రూ.10.75కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ(రూ.9.50కోట్లు), వాషింగ్టన్ సుందర్(రూ. 3.20కోట్లు), రూథర్‌ఫోర్డ్(రూ.2.60కోట్లు), గెరాల్డ్ కొయిట్జీ(2.40కోట్లు), గ్లెన్ ఫిలిప్స్(రూ.2కోట్లు), సాయి కిశోర్ (రూ.2కోట్లు), మహిపాల్ లామ్రోర్(రూ.1.70కోట్లు), గుర్నూర్ సింగ్ బ్రార్(రూ. 1.30కోట్లు), మహ్మద్ అర్షద్ ఖాన్(రూ.1.30కోట్లు), కరీం జనత్(రూ.75లక్షలు), జయంత్ యాదవ్(రూ.75లక్షలు), ఇషాంత్ శర్మ(రూ.75లక్షలు), కుమార్ కుషాగ్ర(రూ.65లక్షలు), కుల్వంత్ ఖేజ్రోల్య(రూ.30లక్షలు), మానవ్ సుతార్(రూ.30లక్షలు), అనుజ్ రావత్(రూ.30లక్షలు), నిషాంత్ సింధు(రూ.30లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : రషీద్ ఖాన్(రూ.18కోట్లు), శుభ్‌మన్ గిల్(రూ.16.50కోట్లు), సాయి సుదర్శన్(రూ.8.50కోట్లు), తెవాటియా (రూ.4కోట్లు), షారుక్ ఖాన్(రూ.4కోట్లు)