Vaibhav Suryavanshi : ఐపీఎల్ వేలం.. 13 ఏళ్ల కుర్రాడి పై కోట్ల వర్షం.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
ఐపీఎల్ మెగా వేలంలో బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

Vaibhav Suryavanshi Makes History becomes youngest player signed in IPL history
ఐపీఎల్ మెగా వేలంలో బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్సుడిగా నిలిచాడు. అతడి వయస్సు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ.1.10 కోట్లకు దక్కించుకుంది.
రూ.30లక్షల కనీస ధరతో సూర్య వంశీ వేలంలో అడుగుపెట్టాడు. అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. అతడి ధరను పెంచుకుంటూ పోయాయి. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి వైదొలగగా.. రూ.1.10 కోట్లకు రాజస్థాన్ అతడిని దక్కించుకుంది.
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ స్వస్థలం బీహార్. దేశవాలీ క్రికెట్‌లో ఆ రాష్ట్ర రంజీ టీమ్ తరుపున ఆడుతున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. అండర్ 19 ఆసియాకప్ టోర్నీకి ఎంపికయ్యాడు. యూత్ వన్డే కప్‌లో ఆస్ట్రేలియాపై శతకంతో రాణించాడు. సంచనాలు సృష్టిస్తున్న అతడిని ప్రాంఛైజీలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
🚨 13 YEAR OLD VAIBHAV SURYAVANSHI SOLD TO RR AT 1.10CR. 🚨 pic.twitter.com/t6YjJnGdSq
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2024