Lovlina Borgohain : వివాదంలో బాక్సర్ లోవ్లినా..అలా ఎంపిక చేయడం తప్పు అరుంధతీ చౌదరీ సవాల్

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ట్రయల్స్‌ లేకుండా లోవ్లినాను ఎంపిక చేయడం తప్పుంటూ కోటకు చెందిన బాక్సర్ అరుంధతీ చౌదరి సవాలు చేశారు.

Boxer

Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన బాక్సర్ లోవ్లినా వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ట్రయల్స్‌ లేకుండా లోవ్లినాను ఎంపిక చేయడం తప్పుంటూ కోటకు చెందిన బాక్సర్ అరుంధతీ చౌదరి సవాలు చేశారు. డిసెంబర్ 4 నుంచి 19 వరకు ఇస్తాంబుల్‌లో సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాక్సింగ్ 70 కిలోల బరువు విభాగంలో లోవ్లినా ట్రయల్స్‌ నిర్వహించకుండా ఎంపిక చేసింది.

Read More : Metaverse : ఫేస్‌బుక్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి, మెటా పేరును దొంగిలించింది!

70 కిలోల విభాగంలో యూత్ బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అరుంధతి కూడా ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతోంది. దీంతో లోవ్లినా ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించింది అరుంధతి. లోవ్లీనాను చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయడం సరికాదన్నారు అరుంధతి. ప్రాక్టీస్‌లో ఎప్పుడూ లోవ్లీనాను ఓడించానన్నారు. ట్రయల్ ప్రాతిపదికన ఎవరు ఉత్తమంగా కనిపిస్తారో వారినే దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాలని కోరింది.

Read More : Drug Case : ఆర్యన్ ఖాన్‌‌కు సమన్లు..మాలిక్ ఆరోపణలపై స్పందించిన NCB

ట్రయల్స్‌ లేకుండానే లోవ్లినాను ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని అరుంధతి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేసింది. ఇటీవల హిసార్‌లో జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది అరుంధతి.