IPL 2024 సీజ‌న్‌లో అత్యంత వేగవంతమైన బంతి.. బ్యాట్ పైకెత్తేలోపు దూసుకెళ్లింది..! వీడియో వైరల్

ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ పేసర్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున శనివారం ఐపీఎల్ లో అడుగు పెట్టాడు.

Mayank Yadav

LSG Vs PBKS : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ జెయింట్స్ జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో 21ఏళ్ల కుర్రాడు అదరగొట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత వేగవంతమైన బంతులతో పంజాబ్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

Also Read : IPL 2024 : లక్నో బోణీ కొట్టింది.. పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో తొలి విజయం.. ధావన్ కష్టం వృథా!

ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ పేసర్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున శనివారం ఐపీఎల్ లో అడుగు పెట్టాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యంత వేగవంతమైన బంతులతో పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఛేదనలో చెలరేగిపోతున్న పంజాబ్ బ్యాటర్లకు కళ్లెం వేసింది మయాంకే. పంజాబ్ జట్టు కోల్పోయిన తొలి మూడు వికెట్లు మయాంక్ తీసినవే. యువ బౌలర్ దాటికి బెయిర్ స్టో, ధావన్ సైతం ఇబ్బంది పడ్డారు. బెయిర్ స్టోతో పాటు, ప్రభ్ సిమ్రన్, జితేశ్ శర్మ వికెట్లు సమర్పించేసుకున్నారు.

Also Read : RCB vs KKR : ఐపీఎల్‌లో అదో ఆనవాయితీ.. కేకేఆర్ జట్టు రూ.24.75కోట్లు వృథా అయినట్లేనా..?

మయాంక్ తొలి నుంచి నిలకడగా 145kmph కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. ఒక దశలో మయాంక్ వేసిన బంతి 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది. ఈ ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతి అదేకావటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన బంతి వేసింది షాన్ టైట్. అతను వేసిన బంతి 157.7kmph వేగంతో దూసుకెళ్లింది. ఇదిలాఉంటే.. మయాంక్ ఐపీఎల్ లో వేసిన మొదటి ఓవర్ లో 147, 146, 150, 141, 149 kmph వేగంతో బంతులు వేశాడు.

  • IPL 2024 సీజన్ లో వేగవంతమైన బంతులు..
    155.8 kph – మయాంక్ యాదవ్ (LSG vs PBKS)
    153.9 kph – మయాంక్ యాదవ్ (LSG vs PBKS)
    153.4 kph – మయాంక్ యాదవ్ (LSG vs PBKS)
    153 కిమీ – నాంద్రే బర్గర్ (RR vs DC)
    152.3 kph – గెరాల్డ్ కోయెట్జీ (MI vs SRH)
    151.2 kph – అల్జారీ జోసెఫ్ (RCB vs KKR)
    150.9 కి.మీ – మతీషా పతిరన (CSK vs GT)

 

 

 

ట్రెండింగ్ వార్తలు