RCB vs KKR : ఐపీఎల్‌లో అదో ఆనవాయితీ.. కేకేఆర్ జట్టు రూ.24.75కోట్లు వృథా అయినట్లేనా..?

ఐపీఎల్ 2024 టోర్నీలో కేకేఆర్ జట్టు తన మొదటి మ్యాచ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడింది. మొదటి మ్యాచ్ అదరగొడతాడని భావించినప్పటికీ మిచెల్ స్టార్క్ నిరాశపర్చాడు.

RCB vs KKR : ఐపీఎల్‌లో అదో ఆనవాయితీ.. కేకేఆర్ జట్టు రూ.24.75కోట్లు వృథా అయినట్లేనా..?

Mitchell Starc

Mitchell Starc : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కేకేఆర్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచినప్పటికీ ఆ జట్టును ఓ సమస్య వెంటాడుతుండట. ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ జట్టు రూ. 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ, ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లలో స్టార్క్ పేలువ ప్రదర్శన విమర్శల పాలవుతున్నాడు.

Also Read : IPL 2024 : క్రిస్ గేల్, ఎంఎస్ ధోనీ రికార్డులను బ్రేక్ చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2024 టోర్నీలో కేకేఆర్ జట్టు తన మొదటి మ్యాచ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడింది. మొదటి మ్యాచ్ అదరగొడతాడని భావించినప్పటికీ మిచెల్ స్టార్క్ నిరాశపర్చాడు. మొదటి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసినప్పటికీ స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు.. పైగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్ ఆడిన రెండో మ్యాచ్ లోనూ స్టార్క్ విఫలమయ్యాడు. ఆర్సీబీ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో స్టార్క్ నాలుగు ఓవర్లు వేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. దీంతో రెండు మ్యాచ్ లలో 8 ఓవర్లు వేసిన స్టార్క్ 100 పరుగులు సమర్పించుకున్నాడు.  దీంతో  రూ.24.75 కోట్లు వృథా అయినట్లేనా అంటూ స్టార్క్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Also Read : కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. కోహ్లీ, గంభీర్ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

ఐపీఎల్ వేలంలో ఈ సీజన్ ముందు వరకు రూ. 18.5 కోట్లే అత్యధిక ధర. అలాంటిది మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ జట్టు రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభం నాటి నుంచి అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఆశించిన స్థాయిలో ఆడిన దాఖలాలు లేవు. అదే ఆనవాయితీని స్టార్క్ కూడా కొనసాగిస్తున్నాడు. రెండు మ్యాచ్ లలో స్టార్క్ పేలవ ప్రదర్శన తో కేకేఆర్ జట్టు అభిమానులను తీవ్ర నిరాశ పర్చాడు. మున్ముందు కేకేఆర్ జట్టు మ్యాచ్ లలోనైనా స్టార్క్ 25కోట్లకు తగ్గట్లుగా ప్రదర్శన ఇస్తారాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.