Luke Hollmans outrageously innovative shot in Vitality Blast 2025
ఒకప్పుడు బ్యాటర్లు క్రికెట్ బుక్‌లోని షాట్స్ మాత్రమే ఎక్కువగా ఆడేవారు. టీ20లు మొదలు అయ్యాక బ్యాటర్లు ఆడే తీరే మారిపోయింది. ఎడాపెడా బంతిని బాదేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర విచిత్ర షాట్లు ఆడుతున్నారు. తాజాగా ఓ బ్యాటర్ ఆడిన షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం వైటాలిటీ బ్లాస్ట్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో మిడిల్‌సెక్స్ బ్యాటర్ ల్యూక్ హాల్మన్ విచిత్ర రీతిలో ఓ షాట్ ఆడాడు. అతడు ఆడిన షాట్ ను చూసిన నెటిజన్లు ఇదెక్కిడి షాట్ రా అయ్యా అని కామెంట్లు పెడుతున్నారు.
All Luke Hollman could do after this was laugh… pic.twitter.com/c8JKnjGMFi
— Vitality Blast (@VitalityBlast) July 16, 2025
వైటాలిటీ టీ20 బ్లాస్ట్ లో భాగంగా బుధవారం మిడిల్‌సెక్స్, సర్రే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ల్యూక్ హాల్మన్.. మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో సరికొత్త షాట్ ఆడాడు. సర్రే బౌలర్ సామ్ కరన్ ఓ ఈ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని ల్యూక్ చాకచక్యంగా బౌండరీకి తరలించాడు. బౌలర్ బాల్ వేసే సమయంలో స్టాన్స్ మార్చుకున్న ల్యూక్.. బౌలర్ స్లో బాల్ వేయడాన్ని గమనించి తన పొజిషన్ మార్చుకుని బంతిని బాదాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సర్రే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సర్రే బ్యాటర్లలో విల్ జాక్స్ (52) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో మిడిల్‌సెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులకే పరిమితమైంది. ల్యూక్ హాల్మన్ (32 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికి తన జట్టును గెలిపించుకోలేకపోయాడు.